పల్నాడు జిల్లా,నరసరావుపేట..
ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్(MLA Anil Kumar Yadav) కామెంట్స్..
నెల్లూరు(NELLORE)లో ఇంట్లో నుండి వస్తుంటే చిన్న బాధ 15సంవత్సరాలుగా ఉన్న నియోజకవర్గాన్ని వదిలి వస్తున్నా అని పల్నాడు ప్రజలు స్వాగతించిన తీరు చూసి గర్వంగా ఫీల్ అవుతున్న, జగనన్న తీసుకున్న నిర్ణయం సరైనదే. నన్ను ఫైర్ బ్రాడ్ అంటారు గాని నా జీవితంలో తెలియని బాధలు ఎన్నో ఉన్నాయి. నేను ఒంటరిని. త్రికోటేశ్వరుని సాక్షిగా చెబుతున్న జగనన్న 2009 నుండి ప్రయాణిస్తున్న. జగనన్న నాకు కొండంత అండగా ఉన్నాడు. జగనన్న నరసరావుపేట వెళ్ళిలి అన్నాడు అంతే టైగర్ కా హుక్కుమ్ అని వచ్చేసా.
Follow us on : Facebook, Instagram & YouTube.
అన్న ఆదేశిస్తే ఈ రాష్ట్రం ఓడిపోయే సీటు అనుకున్న ప్రాంతానికి కూడా ఖచ్చితంగా పోతాను. జగన్న ఎమ్మెల్యే చేసాడు, మంత్రిని చేసాడు, రేవు ఎంపీ చేస్తున్నాడు. నెల్లూరులో కొందరు ముక్కు సూటిగా,నేరుగా ఉంటావు ఇక్కడ సెట్టు కావు అంటారు. నాకు సెట్టు అయ్యే ప్రాంతానికే జగనన్న పంపించాడు. గొర్రెలు కాసుకునే వాడికి జగన్ మంత్రి పదవి ఇచ్చాడు అన్నారు, కానీ వాళ్ళు మరిచిపోయారు. భారతదేశం అంత మొక్కేది గొర్రెలు కాసుకునే శ్రీకృష్ణ పరమాత్ముడినే. పల్నాడు ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారని నమ్మి మీ దగ్గరకు వచ్చాను,నన్ను దీవిస్తారో,తెంచుతారో నా భవిష్యత్తు మీ చేతుల్లో పెట్టి వచ్చాను. మా నెల్లూరులో మీసం తిప్పితే అక్కడి రాజకీయ నాయకులు రౌడీ,గుండా అంటారు. కానీ మీసం తిప్పితే పౌరుషం అంటారని మరిచిపోయారు. కానీ పల్నాడులో నచ్చినట్టు పౌరుషంగా ఉంటా. పంచ కట్టి మీసం తిప్పుతా..నాకు నచ్చినట్టు ఉంటా. పైనున్న ఆదేవుడు,తాడేపల్లిలో ఉన్న ఈ దేవుడుని నమ్మాను. ఇక్కడి వరకు వచ్చాను తరువాత ఢిల్లీ కి పోతాను.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.