ఏపీలో కొత్త మద్యం పాలసీ అమలు కానుంది. అక్టోబర్ 1 వ తేదీ నుంచి ఏపీలో కొత్త మద్యం పాలసీని అమలు చేయనున్నట్లు.. ఏపీ కేబినెట్ సమావేశం తర్వాత మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. అక్టోబర్ 1 నుంచి ఏపీలో కొత్త మద్యం పాలసీ. ఇక ఇదే మీడియా సమావేశంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీకి సంబంధించిన పలు కీలక అంశాలను మంత్రి వివరించారు. కొత్త మద్యం పాలసీ, క్యూఆర్ కోడ్‌తో కూడిన పాస్ పుస్తకాల పంపిణీ.. జగన్ బొమ్మ, పేరు ఉన్న సర్వే రాళ్లను తొలగించడం, స్థానిక సంస్థల్లో పోటీ చేసేవారికి ఉన్న ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేయడం, మత్స్యకారులకు సంబంధించిన జీవోను రద్దు చేయడం సహా పలు కీలక అంశాలను కేబినెట్ భేటీలో చర్చించినట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో అక్టోబర్ 1 వ తేదీ నుంచి నూతన మద్యం విధానం అమలు చేస్తామని ప్రకటించారు. తక్కువ ధరకే నాణ్యమైన మద్యాన్ని అందిస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖలో భారీగా అవినీతికి పాల్పడిందని గుర్తించారు. దీంతో ఈసారి ఎలాంటి అక్రమాలకు ఆస్కారం లేకుండా.. కొత్త మద్యం పాలసీలో మార్పులు, చేర్పులపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ప్రతిపక్షాల డ్రామాలుప్రతిపక్షాలు కావాలనే కొన్ని కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ డ్రామాలు చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేవని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా, మానకొండూరు నియోజకవర్గంలోని కేశవపట్నం మండలం, తాడికల్ గ్రామంలో గల…
- నష్టాల్లో కంగువా నిర్మాత … అండగా హీరో సూర్యదర్శకుడు శివ తెరకెక్కించిన ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా, తమిళ స్టార్ సూర్య హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కంగువా. ఇది ఒక పీరియాడికల్ డ్రామా కాన్సెప్ట్ తో సరికొత్త కథతో వచ్చిన ఈ సినిమా…
- ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధం…వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ ల మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేస్తారా.. లేదా.. అన్న అంశం అందరిని ఆలోచింపచేస్తుంది. ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు.. ఆయన ఇంటి వద్ద ఆర్జీవీ కోసం…
- మంత్రి వస్తేనే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంత్రి వస్తేనే పంపిణీ చేస్తామని అధికారులు చెబుతూ లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేయడం ఆనవాయితీ కానీ మంత్రి…
- నిందితులతో కలిసి పోలీసుల చేతివాటంపోలీసులే నిందితులతో చేతులు కలిపి వారి వద్ద భారీ ఎత్తున డబ్బులు తీసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలం, వేల్పూరు గ్రామంలో రెండు గేదెలను అపహరించిన కేసులో తణుకు రూరల్ పోలీసులు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి