అమరావతి(Amaravati) ప్రాంత రైతుల ఉద్యమం..
అమరావతి ప్రాంత రైతుల ఉద్యమం దక్షిణ భారతదేశం(South India)లో అతిపెద్ద రైతు పోరాటమని సుప్రీంకోర్టు(Supreme Court) మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ(N.V. Ramana) అన్నారు. రాజధాని నిర్మాణానికి రైతులు గత టీడీపీ ప్రభుత్వానికి భూమి ఇచ్చారని తెలిపారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు నేరం చేయలేదని.. కానీ జగన్ ప్రభుత్వం వారిపై దమనకాండ సాగించడం దురదృష్టకరమని ఆందోళన వ్యక్తం చేశారు. నేషనల్ లీగల్ సర్వీస్ అధారిటీ ద్వారా రైతులు కోర్టుకెళ్లవచ్చని అన్నారు. రాజకీయ పార్టీలను రైతులు నిలదీయాలని అన్నారు. న్యాయవ్యవస్థ రైతులను తక్కువగా చూస్తోందని మండిపడ్డారు. రైతుకు భూమికి ఉన్న సంబంధాన్ని అర్థంచేసుకోలేని వాళ్లు న్యాయవ్యవస్థలో ఉన్నారని చెప్పారు. రైతు తమ భూమిని కోల్పోతే కుటుంబాన్నే కోల్పోయినట్లు భావిస్తారని చెప్పారు. రైతు సంఘాలు చైతన్యవంతం కావాలని.. రైతులకు న్యాయం జరగాలనేదే తన కోరిక అని చెప్పారు.
ఇది చదవండి: పల్నాడులో వైసీపీకి బిగ్ షాక్..
వీరవల్లిలోని కామధేను మిల్క్ ప్రాజెక్ట్ ప్రాంగణంలో గురువారం నాడు కృష్ణా మిల్క్ యూనియన్ పాలకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ఎన్వీ రమణ పాల్గొని మూడో విడత బోనస్ చెక్కులను రైతులకు అందజేశారు. రమణకు కృష్ణామిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు, పాలకవర్గ సభ్యులు, రైతులు సన్మానం చేశారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ కృష్ణా మిల్క్ యూనియన్ వందలకోట్ల ఆదాయం సంపాదిస్తూ చాలా అద్భుత విజయాలను సాధిస్తోందన్నారు. రక్తాన్ని చమటగా మార్చి పంట పండిస్తోన్న రైతుకు ఆత్మగౌరవం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాగరికత అభివృద్ధి చెందడానికి ముందు రాజులు రైతులను సముచితంగా గౌరవించారని తెలిపారు. నేడు రైతు వృత్తి అంటరానిదిగా మారిందనడంలో సందేహం లేదన్నారు. కోట్ల సంఖ్యలోని రైతుల కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయట్లేదని అన్నారు. దేశంలో వ్యవసాయం పరిశ్రమగా గుర్తింపు పొందలేదని చెప్పారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి