సీఎం జగన్(CM Jagan) నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం(Memanthaa Siddham) బస్సు యాత్ర(Bus Yatra) గుంటూరుకు చేరుకోనుంది. ఉదయం 9 గంటలకు ధూళిపాళ్ల నుంచి బయల్దేరనున్న జగన్..
సత్తెనపల్లి, కొర్రపాడు, మేడికొండూరు, పేరిచెర్ల.. నేడునల్లపాడు మీదుగా హౌసింగ్ బోర్టు వరకు బస్సు యాత్ర జరగనుంది. భోజన విరామం తర్వాత చుట్టుగుంట సర్కిల్.. వీఐపీ రోడ్ మీదుగా జగన్ బస్సు యాత్ర కొనసాగనుంది. మ. 3:30 గంటలకు ఏటుకూరు బైపాస్ దగ్గర బహిరంగ సభ తర్వాత తక్కెళ్లపాడు, పెదకాకాని, వెంగళ్రావునగర్.. నంబూరు క్రాస్ మీదుగా కొనసాగనుంది. రాత్రికి నంబూరు బైపాస్ దగ్గర సీఎం జగన్ బస చేయనున్నారు.
ఇది చదవండి:ఈసిఐకి కనకమేడల రవీంద్ర లేఖ..!
శనివారం మధ్యాహ్నం మంగళగిరి మీదుగా విజయవాడ వెళ్తారు. గుంటూరులోని ఏటుకూరు వద్ద సిఎం సభకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి విడదల రజని, ఎంపి ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మురుగుడు హనుమంతరావు, వైసిపి గుంటూరు లోక్సభ అభ్యర్థి కిలారు రోశయ్య, అసెంబీ అభ్యర్థులు మేకతోటి సుచరిత, నూరిఫాతిమా, బాలసాని కిరణ్, మురుగుడు లావణ్య, అంబటి మురళీకృష్ణ, వైసిపి జిల్లా అధ్యక్షులు డొక్కా మాణిక్యవర ప్రసాద్, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు తదితరులు పరిశీలించారు. గుంటూరు లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి జనసమీకరణపై దృష్టి సారించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.