Web Casting :
2024-సాధారణ ఎన్నికల పోలింగ్ ను వెబ్ కాస్టింగ్ విధానంలో పరిశీలించడం జరుగుతుందని కాకినాడ జిల్లా ఎన్నికల అధికారిణి, జిల్లా కలెక్టర్ డా కృతికా శుక్లా అన్నారు. బుధవారం కాకినాడ కలెక్టరేట్ లో జిల్లాలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఎన్నికల అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రత్యేక సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితా-2024 లోని అంశాలు, మార్పులు చేర్పులు, 18-19 మధ్య వయసున్న యువత ఓటు నమోదు, పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు, ఈ -ఎపిక్ కార్డుల పంపిణీ, ఈవిఎం, వివిప్యాట్ ల ద్వారా ఓటింగ్ విధానం వంటి అంశాలపై రాజకీయ పార్టీ ప్రతినిధులతో చర్చించి, కాకినాడ పార్లమెంటు స్థానంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కలెక్టర్ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను జిల్లాలో పటిష్టంగా అమలు చేయడం జరుగుతుందన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలను వెబ్ కాస్టింగ్ లైవ్ విధానంలో పోలింగ్ ను పరిశీలించడం జరుగుతుందన్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow us on : Facebook, Instagram & YouTube.