చైనాలో మరో కొత్త వైరస్..!

Another new virus in China

Advertisements

&NewLine;<p>కొవిడ్ మహమ్మారి సృష్టించిన విలయం నుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచం తేరుకుంటున్న వేళ కరోనా పుట్టిల్లు చైనాలో మరో కొత్త వైరస్ అలజడి రేపుతోంది&period; చైనా స్కూళ్ల ద్వారా గుర్తించని ఒక న్యుమోనియా వ్యాప్తి చెందుతోంది&period; ఊపిరితిత్తుల వాపు&comma; తీవ్రమైన జ్వరంతోపాటు అసాధారణ లక్షణాలు పిల్లల్లో కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు&period; అయితే సాధారణ దగ్గు&comma; ఫ్లూ&comma; ఆర్ఎస్‌వీ&comma; ఇతర శ్వాసకోశ వ్యాధుల సంబంధం లక్షణాలు లేవని అంటున్నారు&period; ఈ వైరస్ కారణంగా ఆసుపత్రుల్లో చేరుతున్న పిల్లల సంఖ్యను చూస్తుంటే కొవిడ్-19 నాటి పరిస్థితులు గుర్తుకు వస్తుండడం ఆందోళన కలిగిస్తోంది&period; ఈ పరిస్థితి పట్ల చైనా ఆరోగ్య వ్యవస్థ కలవరం చెందుతోంది&period; ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో పిల్లలు అనారోగ్యానికి గురవ్వడంతో తల్లిదండ్రులు హాస్పిటల్స్‌కు తీసుకెళ్తున్నారు&period; రోగులు పెద్ద సంఖ్యలో వస్తుండడంతో బీజింగ్&comma; లియానింగ్‌ ప్రావిన్స్‌లలోని ఆసుపత్రులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది&period; ఆసుపత్రుల వనరులు అడుగంటే స్థితికి చేరుకుంటున్నాయని మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి&period; కాగా కొత్త రకం న్యుమోనియా వ్యాప్తి కారణంగా పాఠశాలలు మూసివేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని స్థానిక మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి&period; ప్రపంచవ్యాప్తంగా మనుషులు&comma; జంతువులలో వ్యాధుల వ్యాప్తిని గుర్తించే ఓపెన్-యాక్సెస్ నిఘా ప్లాట్‌ఫారమ్ &OpenCurlyQuote;ప్రోమెడ్’ ఈ విషయాన్ని వెల్లడించింది&period; చైనా ఇంకా నిర్ధారించని న్యుమోనియా పిల్లలను ప్రభావితం చేస్తోందని మంగళవారం అప్రమత్తత ప్రకటించింది&period; ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తోందని తెలిపింది&period; న్యూమోనియా విస్తృతంగా సోకుతోందని&comma; వ్యాపించడం ఎప్పుడు ప్రారంభమైందో స్పష్టంగా చెప్పలేమని ప్రోమెడ్ రిపోర్ట్‌లో పేర్కొంది&period; చాలా మంది పిల్లలు ఇంత త్వరగా ప్రభావితం కావడం అసాధారణమని వివరించింది&period; అయితే ఈ వైరస్ పెద్దలకు కూడా వ్యాపిస్తోందా లేదా అనేది పేర్కొనలేదు&period; ఇది మరొక మహమ్మారి అని అంచనా వేయడం తొందరపాటే అవుతుందని&comma; అయితే వైరాలజిస్ట్‌లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ప్రస్తావించింది&period; కాగా కరోనాకు ముందు కూడా &OpenCurlyQuote;ప్రోమెడ్’ ఇదే విధంగా హెచ్చరించింది&period; వైరస్ వ్యాపించకముందే డిసెంబర్ 2019 చివరలో ఒక రిపోర్ట్ ద్వారా హెచ్చరించింది&period; ప్రపంచ ఆరోగ్య సంస్థలోని వివిధ ఉన్నత స్థాయి అధికారులతోపాటు వైద్య నిపుణులు&comma; శాస్త్రవేత్తలను అప్రమత్తం చేసింది&period; ఆ తర్వాత దానిని కరోనాగా గుర్తించారు&period; ప్రపంచం మొత్తం ఏవిధంగా ఇబ్బంది పడిందో అందరికీ తెలిసిందే&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.