ఆకివీడు రామాలయం వివాదంపై స్పందించిన డిప్యూటీ స్పీకర్..

ఆకివీడు రామాలయం వివాదంపై స్పందించిన డిప్యూటీ స్పీకర్

Advertisements

<p>పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు శ్రీరామాలయం నిర్మాణ వివాదంపై డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు చేశారు&period; ఆలయ నిర్మాణంపై కోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు ఇవ్వడంపై ఆయన స్పందించారు&period; కాళ్ల మండలం పెదఅమిరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రఘురామ మాట్లాడుతూ&&num;8230&semi; కోర్టు స్టే ఇవ్వలేదని&comma; కేవలం యథాతథ స్థితి &lpar;స్టేటస్ కో&rpar; విధించిందని స్పష్టం చేశారు&period; ఉండ్లమట్ల జయంతి అనే మహిళ ద్వారా కొందరు కావాలనే పిటిషన్ వేయించారని&comma; దీనిపై కోర్టు సెలవులు ముగిసేలోపు సీనియర్ లాయర్లతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు&period; ఈ విషయంలో కేవియట్ వేయకపోవడం పెద్ద పొరపాటని&comma; ఇందుకు రామభక్తులు తనను క్షమించాలని కోరారు&period; ఇదే సమయంలో తన రాజకీయ&comma; వ్యక్తిగత అంశాలపై రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు&period; తాను తెలుగుదేశం పార్టీలోనే ఉన్నానని స్పష్టం చేసిన ఆయన&&num;8230&semi; హిందూ దళితులకు అన్యాయం జరుగుతుంటే మాట్లాడటం తప్పా అని ప్రశ్నించారు&period; దళిత క్రైస్తవులకు ఓట్లు ఉన్నట్లే హిందువులకు కూడా ఓట్లు ఉన్నాయని గుర్తు చేశారు&period; తనను చంపేస్తామని బెదిరింపులు వస్తున్నా భయపడే ప్రసక్తే లేదని రఘురామ తేల్చిచెప్పారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్లో నకిలీ బీటీ-3 పత్తి విత్తనాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణా శిబిరం…

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్బ్యూరో సమావేశం..