భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం...చైనా, పాక్‌కు షాక్!

Advertisements

<p>ప్రపంచ రక్షణ రంగంలో వ్యూహాత్మక సమీకరణాలను పూర్తిగా మార్చే సంచలన పరిణామం వెలుగులోకి వచ్చింది&period; రష్యా తన అత్యంత అధునాతన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌గా పేరుగాంచిన S-500ను పూర్తి సాంకేతిక బదిలీతో భారత్‌లోనే తయారు చేసుకునే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు అంతర్జాతీయ రక్షణ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది&period; ఇప్పటివరకు రష్యా అత్యంత గోప్యంగా భావించిన ఈ సాంకేతికతను ఇతర దేశాలకు అందించడంలో ఎప్పుడూ జాగ్రత్తగా వ్యవహరిస్తుంది &period; ఈ నేపథ్యంలో భారత్‌కు ఈ స్థాయి యాక్సెస్ ఇవ్వాలనుకోవడం వెనుక వ్యూహాత్మక కారణాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు&period; ఇప్పటికే భారత్ వద్ద ఉన్న S-400 వ్యవస్థ దేశ వైమానిక రక్షణకు బలమైన కవచంలా నిలుస్తుండగా&comma; S-500 చేరితే అది మరింత శక్తివంతమైన మల్టీ లేయర్ డిఫెన్స్‌గా మారనుంది&period; హైపర్‌సోనిక్ క్షిపణులు&comma; బాలిస్టిక్ మిస్సైల్స్&comma; స్టెల్త్ ఫైటర్ జెట్లు&comma; అంతరిక్ష ముప్పులను కూడా ఎదుర్కోగల సామర్థ్యం ఈ వ్యవస్థకు ఉంది &period; ఈ వ్యవస్థ ఆసియా రక్షణ రంగ సమీకరణాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p>&lpar;&rpar;S-500 కేవలం మరో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కాదు&period;&period; భవిష్యత్ యుద్ధ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన అత్యాధునిక రక్షణ కవచం&period; దాదాపు 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను గుర్తించి&comma; గగనతలంలోనే ధ్వంసం చేయగల సామర్థ్యం దీనికి ఉందని రష్యా వర్గాలు చెబుతున్నాయి&period; ముఖ్యంగా హైపర్‌సోనిక్ ఆయుధాలు&comma; అంతరిక్షం నుంచి వచ్చే ముప్పులను అడ్డుకునే శక్తి దీనికి ఉండటం వల్ల ప్రపంచ దేశాల దృష్టి ఈ వ్యవస్థపై పడింది&period; ప్రస్తుతం చైనా తన సైనిక శక్తిని వేగంగా పెంచుకుంటుండగా&comma; పాకిస్తాన్ కూడా క్షిపణి సామర్థ్యాలను అభివృద్ధి చేస్తోంది&period; ఈ నేపథ్యంలో భారత్‌కు S-500 అందుబాటులోకి వస్తే అది దక్షిణాసియాలో ఆయుధ శక్తి సమతౌల్యాన్ని పూర్తిగా మార్చేస్తుందని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు&period; భారత్ ఇప్పటికే స్వదేశీ ఆకాశ్‌తీర్ నెట్‌వర్క్‌తో పాటు S-400ను వినియోగిస్తూ గగనతల రక్షణను బలోపేతం చేస్తోంది&period; దీనికి S-500 జతకలిస్తే భారత్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఎయిర్ డిఫెన్స్ నెట్‌వర్క్ కలిగిన దేశాలలో ఒకటిగా ఎదిగే అవకాశముంది&period;<&sol;p>&NewLine;<p>&lpar;&rpar;అయితే ఈ డీల్ వెనుక కేవలం రక్షణ అవసరాలే కాకుండా అంతర్జాతీయ రాజకీయాలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి&period; ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పాశ్చాత్య దేశాల ఆంక్షలతో రష్యా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది&period; ప్రపంచ ఆయుధ మార్కెట్లో తన ప్రభావాన్ని కొనసాగించాలంటే భారత్ వంటి భారీ మార్కెట్‌తో కలిసి పనిచేయడం అవసరమని మాస్కో భావిస్తోంది&period; అందుకే పూర్తి టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్&comma; భారత్‌లో తయారీ&comma; భవిష్యత్‌లో ఎగుమతుల అవకాశాల వంటి ఆఫర్లతో ముందుకు వస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు &period; కానీ మరోవైపు అమెరికా &OpenCurlyQuote;CAATSA’ ఆంక్షల చట్టం ఈ ఒప్పందంపై ప్రభావం చూపే అవకాశం ఉంది&period; గతంలో భారత్ S-400 కొనుగోలు చేసినప్పుడు అమెరికా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినా&comma; ఇండో-పసిఫిక్ వ్యూహంలో భాగంగా భారత్ కీలక భాగస్వామి కావడంతో మినహాయింపు ఇచ్చింది&period; చైనాను కట్టడి చేయడానికి భారత్ కు ఈ తరహా రక్షణ వ్యవస్థ అవసరమని భావించింది &period; ఇప్పుడు S-500 డీల్ ముందుకు వెళితే వాషింగ్టన్ ఎలా స్పందిస్తుందో అంతర్జాతీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి&period; భారత్ మాత్రం తన జాతీయ భద్రతే ప్రాధాన్యమని స్పష్టం చేస్తూ వ్యూహాత్మక సమతౌల్యాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తోంది&period;చూడాలి మరి ఏమి జరుగుతుందో &period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..

ప్రపంచంలోనే పెద్ద ఫ్యామిలీ: 181 మంది సభ్యులు..100 గదుల ఇల్లు..