పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

‘ఐక్య’ నా బిడ్డ లాంటిది.. మా ఈ ట్రస్ట్ వాయిస్‌లెస్‌కి వాయిస్‌గా ఉంటుంది

Advertisements

<p>టాలీవుడ్‌లో ప్రముఖ స్టార్ హీరో à°°à°¾ కింగ్ మనోజ్ మంచు ఎన్నో మంచి చిత్రాలతో ఆడియెన్స్‌ని అలరించారు&period; ఎప్పుడూ ప్రయోగాత్మక చిత్రాల్ని చేస్తూ&comma; డిఫరెంట్ కంటెంట్‌తో సినిమాల్ని తీస్తూ కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు మంచు మనోజ్&period; అలాంటి హీరో తన పుట్టిన రోజు &lpar;మే 20&rpar; సందర్భంగా మంగళవారం నాడు మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు&period; తన ఐక్య ట్రస్ట్&comma; తన సినీ ప్రయాణం&comma; రాజకీయ ప్రవేశం వంటి విషయాల గురించి ఎన్నో విశేషాల్ని పంచుకున్నారు&period; ఈ క్రమంలో ఆయన చెప్పిన సంగతులివే&period;&period;<&sol;p>&NewLine;<p>&OpenCurlyQuote;ఐక్య’ పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది&quest;<br &sol;>&NewLine;నేను సూపర్ మ్యాన్‌ని కాదు&period; అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండకపోవచ్చు&period; అందుకే ఈ ట్రస్ట్‌ను పెట్టాలని అనుకున్నాం&period; వాయిస్ లెస్‌కి వాయిస్‌గా ఈ ట్రస్ట్ ఉంటుంది&period; అలా &OpenCurlyQuote;ఐక్య ధైర్య సేనా సమితి’ అని పెట్టడానికి చాలా కారణాలున్నాయి&period; ఐక్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలం&period; విభజించుకుంటూ వెళ్తే చివరకు ఏమీ మిగలదు&period; అందుకే అందరం ఐక్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఐక్య అని పెట్టాం&period; నా కొడుకు పేరు ధైరవ్&comma; నా బిడ్డ పేరు దేవ సేన ఇలా అందరి పేర్లు కలిపి &OpenCurlyQuote;ఐక్య ధైర్య సేనా సమితి’ అని పెట్టాం&period; ఈ ట్రస్ట్ కూడా మాకు ఓ బిడ్డ లాంటిదే&period;<&sol;p>&NewLine;<p>&OpenCurlyQuote;ఐక్య’ ట్రస్ట్ ఎలా వర్క్ చేస్తుంది&quest; నియమాలు ఏంటి&quest;<br &sol;>&NewLine;&OpenCurlyQuote;ఐక్య’కి ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదు&period; ఎప్పటి నుంచో ఇలాంటి ఓ ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని అనుకున్నాం&period; దానికి సంబంధించిన నియమాల్ని ఇంకా రూపొందించలేదు&period; మేం ప్రస్తుతం అదే పనిలో ఉన్నాం&period; కావాల్సిన నిధి కోసం మేం ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తాం&period;<&sol;p>&NewLine;<p>&OpenCurlyQuote;ఐక్య’కి ఇతర వివరాల్ని ఎప్పుడు ప్రకటిస్తారు&quest;<br &sol;>&NewLine;జూన్ 7à°¨ నా కొత్త సినిమా &OpenCurlyQuote;రక్షక్’ ప్రారంభం కాబోతోంది&period; ప్రస్తుతం మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు&comma; మహిళా సాధికారత నేపథ్యంలో &OpenCurlyQuote;రక్షక్’ చిత్రం ఉంటుంది&period; అందులో నేను డీసీపీగా పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషిస్తున్నాను&period; ఆ మూవీ ప్రారంభోత్సవం నాడే &OpenCurlyQuote;ఐక్య’కి సంబంధించిన అన్ని విషయాల్ని అధికారికంగా ప్రకటిస్తాను&period; అంతలోపు &OpenCurlyQuote;ఐక్య’ కోసం మీడియా వారి నుంచి కూడా సలహాలు తీసుకుంటాను&period;<&sol;p>&NewLine;<p>మీ సినీ ప్రయాణం ఎలా సాగుతోంది&quest; కథల ఎంపికలో పూర్తి నిర్ణయం మీదేనా&quest;<br &sol;>&NewLine;నాకు సినిమాల్లో మళ్లీ పునర్జన్మను ఇచ్చిన విజయ్ కనకమేడల గారికి&comma; కార్తిక్ ఘట్టమనేని గారికి జీవితాంతం రుణపడి ఉంటాను&period; ప్రస్తుతం అన్ని రకాల పాత్రల్ని చేయాలని అనుకుంటున్నాను&period; కెరీర్ ప్రారంభం నుంచీ ఇప్పటి వరకు ప్రతీ స్క్రిప్ట్&comma; కథని నేనే విన్నాను&period; నేనే ఓకే చేశాను&period; ఇప్పుడు కూడా నేనే వింటాను&period; నాకు నచ్చిన కథల్నే చేస్తాను&period; నా వృత్తిపరమైన జీవితంలోకి నా భార్య గానీ&comma; ఆమె వృత్తిపరమైన జీవితంలోకి నేను గానీ వెళ్లం&period; మేం పరస్పరం ఆ విషయంలో ఒకరినొకరిని గౌరవించుకుంటాం&period;<&sol;p>&NewLine;<p>ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారు&quest;<br &sol;>&NewLine;మేం పుట్టినప్పటి నుంచీ రాజకీయాల్లోనే ఉన్నాం&period; కొత్తగా రాజకీయాల్లోకి రావడం అని ఏముంది&period; వచ్చే ఎన్నికల్లో నా భార్య పోటీ చేస్తారు&period;<&sol;p>&NewLine;<p>మే 20 అంటే ఎన్టీఆర్&comma; సిరివెన్నెల సీతారామశాస్త్రి పుట్టిన రోజు కూడా కదా&period;&period;&quest;<br &sol;>&NewLine;నా పుట్టిన రోజుని తారక్ అన్నతో&comma; స్వర్గీయ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారితో కలిసి జరుపుకోవడం ఆనందంగా ఉంటుంది&period; సిరివెన్నెల గారికి అంతం అంటూ ఉండదు&period; ఆయన ఎప్పుడూ మనతోనే ఉంటారు&period; మనలోనే ఉంటారు&period;<&sol;p>&NewLine;<p>&OpenCurlyQuote;డేవిడ్ రెడ్డి’ ఎలా ఉండబోతోంది&quest;<br &sol;>&NewLine;నేను దాని గురించి ప్రత్యేకంగా చెప్పేకంటే రేపు &lpar;మే 20&rpar; సాయంత్రం గ్లింప్స్ రాబోతోంది&period; మాటల కంటే మన పని చెబితేనే బెటర్&period; షూటింగ్ దాదాపు 40 శాతం పూర్తయింది&period; హనుమా రెడ్డి గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా షూటింగ్ చేస్తున్నారు&period; మధ్య ప్రదేశ్‌లో ఈ మధ్యే షూటింగ్ చేసి వచ్చాం&period; మధ్య ప్రదేశ్ ప్రభుత్వం మా అందరినీ ఎంతో బాగా చూసుకున్నారు&period;<&sol;p>&NewLine;<p>&OpenCurlyQuote;వాట్ ది ఫిష్’ పరిస్థితి ఏంటి&quest;<br &sol;>&NewLine;&OpenCurlyQuote;వాట్ ది ఫిష్’ ఇప్పుడు రావడం లేదు&period; అనుకోని కారణాల వల్ల అది కుదరలేదు&period; నేను&comma; సత్య&comma; వెన్నెల కిషోర్ అందరం కలిసి చేయాల్సిన సినిమా&period; చివరి నిమిషంలో చాలా మందికి వీసా ప్రాబ్లం వచ్చింది&period; స్క్రిప్ట్ బాగుంది&period; మిగిలిన అన్ని పరిస్థితులు కూడా కలిసి రావాలి&period; ఆ టైం ఎప్పుడు వస్తుందో చూడాలి&period;<&sol;p>&NewLine;<p>&OpenCurlyQuote;మోహన రాగ మ్యూజిక్’ పనులు ఎక్కడి వరకు వచ్చాయి&quest;<br &sol;>&NewLine;&OpenCurlyQuote;మోహన రాగ మ్యూజిక్’ చాలా బాగా వస్తుంది&period; అద్భుతమైన ఆర్టిస్టులు&comma; టెక్నీషియన్లు&comma; సింగర్లు పని చేస్తున్నారు&period; ఇప్పటి వరకు నాలుగు పాటలు రికార్డ్ అయ్యాయి&period; మరో నాలుగు పాటలు రెడీ కావాల్సి ఉంది&period; ఇంకో రెండు&comma; మూడు నెలల సమయం పట్టేలా ఉంది&period;<&sol;p>&NewLine;<p>&OpenCurlyQuote;నమస్తే వరల్డ్’ టాయ్స్ గురించి చెప్పండి&quest;<br &sol;>&NewLine;మౌనిక గారు &OpenCurlyQuote;నమస్తే వరల్డ్’ టాయ్స్ గురించి పని చేస్తున్నారు&period; త్వరలోనే బెంగళూరులో&comma; రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రాంచ్‌లు ఏర్పాటు చేయాలని చూస్తున్నారు&period; ఆమెకు నేను జస్ట్ సపోర్ట్‌గా ఉంటున్నాను&period;<&sol;p>&NewLine;<p>ప్రస్తుతం చేస్తున్న సినిమాల గురించి చెప్పండి&quest;<br &sol;>&NewLine;ప్రస్తుతం నా చేతిలో ఐదారు ప్రాజెక్టులున్నాయి&period; వాటికి సంబంధించిన అనౌన్స్మెంట్‌లు ఈ నెలలోనే వస్తాయి&period; ప్రతీ హీరో నుంచి కంటిన్యూగా సినిమాలు రావాలని కోరుకుంటున్నాను&period; నేను కూడా వరుసపెట్టి చిత్రాలు చేయాలనే ప్లానింగ్‌లోనే ఉన్నాను&period; ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాను&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..

ప్రపంచంలోనే పెద్ద ఫ్యామిలీ: 181 మంది సభ్యులు..100 గదుల ఇల్లు..