మళ్లీ పెరిగిన ఇంధన ధరలు..

మళ్లీ పెరిగిన ఇంధన ధరలు

Advertisements

<p>పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ప్రభావంతో చమురు ధరలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి&period; ఈ నేపథ్యంలో వాహనదారులకు మరో షాక్‌ తగిలింది&period; దేశవ్యాప్తంగా పెట్రోల్‌&comma; డీజిల్‌ ధరలు మరోసారి పెరిగాయి&period; దీంతో వారం రోజుల్లోనే ఇంధన ధరలు మళ్లీ పెరగడంతో వాహనదారులపై అదనపు భారం పడుతోంది&period; అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు&comma; దేశీయ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో&comma; దేశవ్యాప్తంగా పెట్రోల్&comma; డీజిల్ ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి&period; తాజా సవరణ ప్రకారం&comma; లీటర్ పెట్రోల్&comma; డీజిల్‌పై సగటున 90 పైసలు మేర భారం పెరిగింది&period; అయితే&comma; వివిధ రాష్ట్రాల్లో ఉండే స్థానిక పన్నులు&comma; రవాణా ఖర్చుల ఆధారంగా కొన్ని నగరాల్లో ఈ పెంపుదల కనిష్టంగా 80 పైసల నుంచి గరిష్టంగా రూపాయి వరకు ఉంది&period; సాధారణ ప్రజలపై నేరుగా ప్రభావం చూపే ఈ à°§à°°à°² పెరుగుదల&comma; రవాణా రంగంపై అదనపు భారాన్ని మోపనుంది&period; గత వారం 3 రూపాయల మేర ఇంధన ధరలు పెరిగిన తర్వాత&comma; తాజాగా మళ్లీ లీటరుకు దాదాపు 90 పైసల వరకు ధరలు పెరగడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది&period; తాజా à°§à°°à°² ప్రకారం తెలంగాణలో పెట్రోల్ à°§à°° లీటరుకు రూ&period;112కు చేరుకోగా&comma; డీజిల్ రూ&period;100గా ఉంది&period; ఏపీలో లీటర్ పెట్రోల్ à°§à°°&period;114కు పెరిగింది&period;<&sol;p>&NewLine;<p>ప్రపంచవ్యాప్తంగా ఎఫెక్ట్‌ చూపిస్తున్న పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం భారత్‌పై కూడా పడుతోంది&period; ముఖ్యంగా హార్ముజ్ జలసంధి ప్రాంతంలో సంక్షోభంతో అంతర్జాతీయ సముద్ర వాణిజ్య మార్గాలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి&period; దీంతో బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లకు పైగా కొనసాగుతున్నాయి&period; అమెరికా&comma; ఇరాన్ మధ్య చర్చలు కొనసాగుతున్నప్పటికీ&comma; ఒప్పందం కుదరకపోవడంతో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి&period; ఈ నేపథ్యంలో ధరలు పెరుతున్నాయి&period; అయితే ఇలా వరుసగా పెట్రోల్‌ à°§à°°à°² పెరుగుదలతో రవాణా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది&period; దీని ప్రభావం కూరగాయలు&comma; నిత్యావసర వస్తువుల ధరలపై కూడా పడొచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు&period; ఇప్పటికే ద్రవ్యోల్బణంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు పెరుగుతున్న ఇంధన ధరలు మరింత భారంగా మారుతున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..