అమెరికా కాలిఫోర్నియాలో కాల్పుల కలకలం..

అమెరికా కాలిఫోర్నియాలో కాల్పుల కలకలం

Advertisements

<p>అమెరికా కాలిఫోర్నియాలో కాల్పుల కలకలం&period;&period;<&sol;p>&NewLine;<p>కాలిఫోర్నియాలోని శాన్‌ డియాగోలో కాల్పులు కలకలం సృష్టించాయి&period; స్థానిక ఇస్లామిక్ సెంటర్ దగ్గర ఇద్దరు టీనేజర్లు జరిపిన కాల్పుల్లో సెక్యూరిటీ గార్డు సహా ముగ్గురు మృతి చెందారు&period; ఈ ఘటనను విద్వేషపూరిత దాడి కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు&period; శాన్‌ డియాగో కౌంటీలోనే అతిపెద్దదైన ఈ మసీదు ప్రాంగణం బయట కాల్పులు జరగడంతో తీవ్ర భయాందోళన నెలకొంది&period; సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని స్థానికులను సురక్షిత ప్రాంతానికి తరలించారు&period; మృతుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డు వల్ల పెను ప్రమాదం తప్పి ఉండొచ్చని తెలిపారు&period;<&sol;p>&NewLine;<p>ఇక దాడి జరిగిన కొద్దిసేపటికే&comma; సమీపంలోని ఓ స్ట్రీట్‌లో పార్క్ చేసిన వాహనంలో ఇద్దరు యువకుల మృతదేహాలను గుర్తించారు&period; ముగ్గురిని చంపిన తర్వాత వారు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు&period; నిందితుల్లో ఒకరు తమ తల్లిదండ్రుల తుపాకీని తీసుకువచ్చారని&period;&period;అలాగే జాత్యహంకారాన్ని ప్రస్తావిస్తూ రాసిన సూసైడ్ నోట్‌ను వదిలి వెళ్లినట్లు తెలుస్తోంది&period; వారి ఆయుధాల్లో ఒకదానిపై విద్వేషపూరిత సందేశాలు రాసి ఉన్నట్లు కూడా దర్యాప్తు అధికారులు వెల్లడించారు&period; ఈ కేసు దర్యాప్తులో FBI కూడా భాగస్వామ్యమవుతోంది&period; దాడి సమయంలో మసీదు ప్రాంగణంలోని పాఠశాలలో ఉన్న పిల్లలందరూ సురక్షితంగా ఉన్నారని&comma; ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని తెలిపారు పోలీసులు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

బొబ్బిలి ఇందిరమ్మ కాలనీలో భూకబ్జాల కలకలం..

క్లాసెన్ మేజిక్, కిషన్ స్థిరతతో SRH ఘన విజయం..

చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేరళం ప్రభుత్వం..