నెల్లూరులో మహానాడుకు భారీ ఏర్పాట్లు..

నెల్లూరులో మహానాడుకు భారీ ఏర్పాట్లు

Advertisements

<p>పసుపు పండుగ మహానాడుకు భారీ ఏర్పాట్లు చేస్తోంది టీడీపీ&period; నెల్లూరు వేదికగా ఈసారి వేడుక జరగనుంది&period; ఈ నెల 27&comma; 28&comma; 29 తేదీల్లో మూడు రోజుల పాటు ఘనంగా జరిగే ఈ వేడుకల కోసం టీడీపీ అధిష్టానం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది&period; వేడుకలను పకడ్బందీగా నిర్వహించేందుకు మొత్తం 20 ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది&period; పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ నేతృత్వంలోని 10 మంది సభ్యుల సమన్వయ కమిటీ ఈ పనులన్నింటినీ పర్యవేక్షించనుంది&period; రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిగా తరలివచ్చే కార్యకర్తలకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు ఉండాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు&period; కమిటీల వారీగా బాధ్యతలను పరిశీలిస్తే పల్లా శ్రీనివాసరావు నేతృత్వంలో ఆహ్వాన కమిటీ&comma; యనమల రామకృష్ణుడు నేతృత్వంలో తీర్మానాల కమిటీని నియమించారు&period; సభా నిర్వహణ బాధ్యతలను పయ్యావుల కేశవ్&comma; రామ్మోహన్ నాయుడు పర్యవేక్షించనుండగా&comma; అచ్చెన్నాయుడు నేతృత్వంలోని కమిటీ&period;&period; వసతి సౌకర్యాలను చూసుకోనుంది&period; నెల్లూరులోని ఇఫ్కో కిసాన్ సెజ్ ప్రాంతంలో సుమారు 150 ఎకరాల్లో ఈ కార్యక్రమం జరగనుంది&period; ఈ వేడుకను చారిత్రాత్మక విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..