ఉత్తరాంధ్రకు మరో భారీ ప్రాజెక్ట్…

Advertisements

<p>పారిశ్రామిక రంగంలో అనకాపల్లి జిల్లా పేరు మరోసారి మార్మోగనుంది&period; ఆర్సెల్లార్‌ మిట్టల్‌ స్టీల్‌ ప్లాంట్‌ శంకుస్థాపనతో జాతీయ&comma; అంతర్జాతీయ స్థాయిలో పారిశ్రామిక వర్గాల్లో అనకాపల్లి జిల్లాపై జరిగిన చర్చ&comma; ఇప్పుడు మరోసారి ప్రస్తావనకు రానుంది&period; ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు రెన్యూవబుల్‌ ఎనర్జీ ఉత్పత్తిపై ఫోకస్‌ పెడుతున్న క్రమంలో ఏపీలోని కూటమి ప్రభుత్వం ఆ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది&period; దీంట్లో భాగంగా రాష్ట్రంలో క్లీన్‌ ఎనర్జీ ఉత్పత్తి సంస్థలకు పెద్ద పీట వేస్తోంది&period; ఈ క్రమంలో రెన్యూవబుల్‌ రంగంలో భారీ పెట్టుబడులతో ఎనర్జీ ప్లాంట్‌ స్థాపించేందుకు ప్రముఖ రెన్యూ ఎనర్జ్‌ గ్లోబల్‌ సంస్థ ముందుకొచ్చింది&period; క్లీన్‌ ఎనర్జీ రంగంలోని ప్రధాన సంస్థల్లో ఒకటిగా ఉన్న రెన్యూ ఎనర్జీ గ్లోబల్‌ సంస్థ ఇప్పటికే దేశంలో 19&period;2 గిగావాట్ల సామర్థ్యంతో వివిధ ప్రాంతాల్లో క్లీన్‌ ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేసి ప్రముఖ స్థానంలో ఉంది&period; అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రెన్యూ ఎనర్జీ గ్లోబల్‌ సంస్థ 6 గిగా వాట్లకు పైగా ఉత్పత్తి సామర్థ్యంతో క్లీన్‌ ఎనర్జీ ప్లాంట్‌ ఏర్పాటుకు ముందుకు వచ్చింది&period; ఇవాళ ఆ ప్లాంట్‌కు భూమి పూజ జరగనుంది&period; ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భూమి పూజ చేయనున్నారు&period; మొత్తంగా5 వేల 4 వందల కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేయబోయే సంస్థకు భూమి పూజ చేపట్టడంతో అనకాపల్లి జిల్లా అభివృద్ధికి కీలక అడుగులు పడనున్నాయి&period; డీకార్బనైజేషన్‌ రంగంలో ముందంజలో ఉన్న ఈ సంస్థ&comma; సుమారు 4 వేల 2వందల కోట్ల పెట్టుబడితో 6 గిగావాట్ల సామర్థ్యం గల సోలార్‌ ఇంగాట్‌–వేఫర్‌ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయబోతోంది&period; దీంతో పాటు మరో 12 వందల కోట్ల వ్యయంతో 125 మెగావాట్ల హైబ్రిడ్‌ క్యాప్టివ్‌ రెన్యూవబుల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ను నిర్మించనుంది&period; ఈ రెండు ప్రాజెక్టులు వచ్చే రెండేళ్లలో పూర్తి కానున్నాయి&period;<&sol;p>&NewLine;<p>రెన్యూ సంస్థ నిర్మించే సోలార్‌ ఇంగాట్‌–వేఫర్‌ తయారీ యూనిట్&comma; హైబ్రిడ్‌ క్యాప్టివ్‌ రెన్యూవబుల్‌ పవర్‌ ప్రాజెక్టుల ద్వారా సుమారు 2 వేల 100 మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి&period; దీంతో స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభించనున్నాయి&period; రాష్ట్రంలో క్లీన్‌ ఎనర్జీని భారీ ఎత్తున ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుకెళ్తున్నారు&period; ఇంధన రంగం బలోపేతమైతే పారిశ్రామిక&comma; వ్యవసాయ&comma; సేవా రంగాలు వేగంగా వృద్ధి చెందుతాయని ప్రభుత్వం భావిస్తోంది&period; దీంతో ఏపీని రెన్యువబుల్‌ ఎనర్జీకి కేంద్రంగా నిలబెట్టడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నారు&period; గతేడాది నవంబర్‌లో విశాఖపట్నంలో జరిగిన సీఐఐ పార్టనర్‌ సమ్మిట్‌కు హాజరైన రెన్యూ ఎనర్జీ గ్లోబల్‌ సంస్థ రాష్ట్రంలో దశలవారీగా 82 వేల కోట్ల పెట్టుబడులు పెడతామని ప్రకటించింది&period; దీంట్లో భాగంగా అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో ఎనర్జీ ప్లాంట్‌ ఏర్పాటుకు పనులను ప్రారంభించనుండగా&comma; త్వరలోనే సుమారుగా 22 వేల కోట్లతో దేశంలోనే అతిపెద్ద హైబ్రిడ్‌ రిన్యూవబుల్‌ ఎనర్జీ ప్రాజెక్టులలో ఒకదాన్ని అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ ప్రక్రియ చేపట్టనుంది&period; 2014–19 మధ్య కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే 2015లో కళ్యాణదుర్గంలో విండ్‌ ప్రాజెక్ట్‌తో రాష్ట్రంలోకి రెన్యూ ఎనర్జీ గ్లోబల్‌ సంస్థ అడుగుపెట్టింది&period; 717 మెగావాట్ల విండ్&comma; 60 మెగావాట్ల సోలార్‌ ఎనర్జీ సామర్థ్యంతో ఏపీలోని రెన్యూ ఎనర్జీ గ్లోబల్‌ ప్లాంట్లు ఇప్పటికే పని చేస్తున్నాయి&period;<&sol;p>&NewLine;<p>కూటమి ప్రభుత్వం వచ్చాక ఉత్తరాంధ్రకు పరిశ్రమలు క్యూ కడుతున్నాయి&period; ఇప్పటికే ఆర్సెలార్‌ మిట్టల్&comma; కాగ్నిజెంట్‌కు వంటి ప్రముఖ సంస్థలకు శంకుస్థాపన చేసి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి&period; టీసీఎస్‌ ఇప్పటికే కార్యకలాపాలను ప్రారంభించింది&period; ఈ నెలలో అతిపెద్ద అంతర్జాతీయ పెట్టుబడి గూగుల్‌ సంస్థకు శంకుస్థాపన చేయనున్నారు&period; సాఫ్ట్‌వేర్&comma; ఎనర్జీ&comma; స్టీల్&comma; మెడ్‌టెక్&comma; ఫార్మా వంటి రంగాల్లో ఉత్తరాంధ్ర ప్రాంతం భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తోంది&period; అలాగే భోగాపురం ఎయిర్‌ పోర్టు త్వరలో అందుబాటులోకి రానుంది&period; మరోవైపు పర్యాటకంగా&comma; ఆధ్యాత్మికంగా కూడా ఉత్తరాంధ్రలో అభివృద్ధి పెద్ద ఎత్తున చోటు చేసుకుంటోంది&period;<&sol;p>&NewLine;<p>ఇవాళ ఉదయం 09&period;30 కి సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి నుంచి జెడ్‌&period;చింతువకు బయలుదేరి వెళతారు&period; 11&period;10 గంటలకు రెన్యూ గ్లోబల్‌ ఎనర్జీ సంస్థ శంకుస్థాపనలో కార్యక్రమంలో పాల్గొంటారు&period; కార్యక్రమాన్ని ముగించుకుని మధ్యాహ్నం 02&period;35 గంటలకు తిరిగి అమరావతి చేరుకుంటారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.