పోలవరం జిల్లా ఫెర్రీ ఘాట్‌లో ప్రయాణీకుల ప్రాణాలతో చెలగాటం.

పోలవరం జిల్లా ఫెర్రీ ఘాట్‌లో ప్రయాణీకుల ప్రాణాలతో చెలగాటం

Advertisements

<p>పోలవరం జిల్లా కూనవరం మండలంలోని రుద్రంకోట ఫెర్రీ ఘాట్ వద్ద ప్రయాణీకుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి&period; చేపల వేటకు వినియోగించే&comma; సరైన అనుమతులు లేని పడవల్లో పరిమితికి మించి ప్రయాణీకులను తరలిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు&period;సుమారు 89 లక్షల రూపాయలకు ఫెర్రీ పాట దక్కించుకున్న నిర్వాహకులు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను పట్టించుకోవడం లేదని ప్రయాణీకులు మండిపడుతున్నారు&period; ద్విచక్ర వాహనాల రవాణాకు ప్రభుత్వం 50 రూపాయల ఛార్జీ నిర్ణయించినప్పటికీ&comma; బోట్ యాజమాన్యం 100 రూపాయల వరకు వసూలు చేస్తోందని ఆరోపిస్తున్నారు&period;ఇప్పటికే రాష్ట్రంలో పలు బోట్ ప్రమాదాలు చోటుచేసుకున్న నేపథ్యంలో&period;&period; అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి&period; అనుమతులు లేకుండా బోట్లు నడపడం&comma; అధిక ఛార్జీలు వసూలు చేయడం&comma; భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రయాణీకులు&comma; స్థానిక ప్రజలు అధికారులను డిమాండ్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.

నీట్ పేపర్ లీక్‍పై సుప్రీంకోర్టులో విచారణ.

నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.