పాపికొండల విహారయాత్రలకు బ్రేక్.

పాపికొండల విహారయాత్రలకు బ్రేక్

Advertisements

<p>పాపికొండల విహారయాత్రకు బ్రేక్‌ పడింది&period; గోదావరిలో పర్యాటక బోట్ల నిర్వహణపై భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ముందుజాగ్రత్తగా పాపికొండలకు వెళ్లే పర్యాటక బోట్ల రాకపోకలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు రంపచోడవరం RDO&period; పాపికొండల విహార యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు&period; ఇటీవల దేవీపట్నం మండలం గండిపోచమ్మ అమ్మవారి ఆలయం నుంచి ఓ బోటులో దాదాపు 89 మంది పర్యాటకులు పాపికొండల విహారయాత్రకు వెళ్లారు&period; దేవీపట్నం పాత పోలీసుస్టేషన్‌ ప్రాంతానికి వెళ్లేసరికి సాంకేతిక లోపం ఏర్పడటంతో అప్రమత్తమైన డ్రైవర్‌ బోటును నిలిపివేశారు&period; దీంతో భద్రతాపరమైన ఆందోళనల నేపథ్యంలో కలెక్టర్‌ ఆదేశాల మేరకు బోట్ల ఫిట్‌నెస్&comma; భద్రతా ప్రమాణాలపై పరిశీలన చేయిస్తున్నారు&period; వీటిపై నివేదిక వచ్చాకే&period;&period; బోట్లకు అనుమతులు ఇస్తామని ఆర్డీవో తెలిపారు&period; నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ.

టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.