అభిమాని నిరంజన్‍ను పరామర్శించిన పవన్.

అభిమాని నిరంజన్‍ను పరామర్శించిన పవన్

Advertisements

<p>ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హన్మకొండలో పర్యటిస్తున్నారు&period; స్థానిక హనుమాన్ నగర్ లో నిరంజన్ అనే బాలుడు ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నాడు&period; తనచివరి కోరిక అభిమాన నటుడైన పవన్ కల్యాణ్ ను కలవడమేనని చెప్పడంతో&period;&period; ఆ బాలుడిని చూసేందుకు పవన్ వారి ఇంటికి వెళ్లారు&period; చాలా కాలంగా కాళ్లు పనిచేయక బాలుడు బాధపడుతున్నాడు&period; నరాల సంబంధిత వ్యాధి కారణంగా నిరంజన్ కాళ్లు పనిచేయడం లేదు&period; అతని వయసు 15 సంవత్సరాలైనా&period;&period; 2-3 ఏళ్ల బాలుడిగా కనిపించడం గమనార్హం&period; గాలిబుడగ లాంటి తన జీవితంలో పవన్ కల్యాణ్ ను కలిసి&comma; ఆయనకు ఆయన సినిమాలోని డైలాగ్ వినిపించాలన్నదే చివరి కోరిక&period; ఆ విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్ నిరంజన్ ను పరామర్శించారు&period; బాలుడి తల్లిదండ్రులతో మాట్లాడి&period;&period; అతని ఆరోగ్య సమస్యలు&comma; దాని చికిత్సపై వివరాలు తెలుసుకున్నారు&period; అక్కడి నుంచి భద్రకాళి ఆలయానికి వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకోనున్నారు&period; అనంతరం స్థానికంగా ఉన్న ఓ రిసార్టులో జనసైనికులతో ఏర్పాటు చేసిన లంచ్ లో పాల్గొని&comma; తిరిగి విజయవాడకు వెళ్తారు&period; ఇటీవల హైదరాబాద్ జనసేన పార్టీ సభకు అనుమతి రాని నేపథ్యంలో&period;&period; తెలంగాణలో ఇదే పవన్ కల్యాణ్ తొలి పర్యటన అయింది&period; దీంతో పవన్ ఫ్యాన్స్ ఆయన్ను చూసేందుకు భారీగా తరలివచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..