పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడం రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనం.

పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడం రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనం

Advertisements

<p>కులమతాల మధ్య చిచ్చుపెట్టడం గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జగన్‌ DNAలోనే ఉందని జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు&comma; డిసిసిబి చైర్మన్ తుమ్మల బాబు విమర్శించారు&period; కాకినాడలో ఆయన మాట్లాడారు&period; కాపు సమాజం పేరుతో సమావేశాలు నిర్వహించి జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై విమర్శ చేయడం వైసిపి నాయకుల రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శమని అన్నారు&period; ఐదేళ్లపాటు అధికారంలో ఉన్న వైసీపీ నాయకులు కాపు రిజర్వేషన్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు&period; కాపు యువతకు ఉపాధి&comma; కాపు కళ్యాణ మండపం నిర్మాణ విషయంలో వైసిపి పార్టీ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు&period; వైసీపీ నాయకులు వ్యక్తిగత విమర్శలు అసత్య ప్రచారాలు మానుకుని ప్రజా సమస్యలపై మాట్లాడాలని&comma; కాపు సమాజాన్ని కేవలం ఓటు బ్యాంకుగా వైసిపి చూడడం జరుగుతుందన్నారు&period; హైదరాబాద్‌ సుభిక్షంగా ఉన్నప్పుడు మతాల మధ్య చిచ్చుపెట్టిన ఘనత జగన్‌ తండ్రిదని అదే ఆనవాయితీని జగన్‌ కొనసాగిస్తున్నారని&comma; రాష్ట్రంలో ఏ ఘటన చోటుచేసుకున్నా దానికి కులం రంగు పులిమేందుకు జగన్‌ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు&period; డాక్టర్‌ సుధాకర్‌&comma; అమర్నాథ్‌ గౌడ్‌&comma; చంద్రయ్యను నిర్దాక్షణ్యంగా పొట్టన పెట్టుకున్నప్పుడు వారికి కులాలు గుర్తుకు రాలేదా అని తుమ్మల బాబు ప్రశ్నించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.