నేడు కర్నూలు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.

నేడు కర్నూలు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

Advertisements

<p>ఒకప్పుడు బంగారు గని అనగానే కర్ణాటకలోని కేజీఎఫ్ మాత్రమే గుర్తుకొచ్చేది&period; ఇప్పుడు ఆ చరిత్ర మారనుంది&period; రాయలసీమలోని కర్నూలు జిల్లా జొన్నగిరి&comma; దేశ పసిడి పటంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోనుంది&period; కరవు నేలగా పేరున్న ఈ ప్రాంతం&comma; ఇప్పుడు బంగారం ఉత్పత్తికి ప్రధాన కేంద్రంగా రూపాంతరం చెందనుంది&period; దేశంలోనే ప్రైవేట్ రంగంలో అతిపెద్ద గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ఇక్కడ ప్రారంభానికి సిద్ధమైంది&period; ఈ ప్రాజెక్టును సీఎం చంద్రబాబు నాయుడు నేడు లాంఛనంగా ప్రారంభించనున్నారు&period;<br &sol;>&NewLine;కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరిలో జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్&comma; డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ సంస్థలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును నెలకొల్పాయి&period; 405 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో ఈ బంగారం శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేశాయి&period; ఇందుకోసం ప్రభుత్వం 1&comma;500 ఎకరాల భూమిని కేటాయించగా&comma; మొదటి దశలో 600 ఎకరాల్లో తవ్వకాలు&comma; ప్రాసెసింగ్ పనులు చేపట్టనున్నారు&period; ఇప్పటికే ట్రయల్ రన్స్ విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ ప్లాంట్‌లో&period;&period; ప్రారంభోత్సవం అనంతరం పూర్తిస్థాయి ఉత్పత్తి మొదలవుతుంది&period; ఈ సందర్భంగా ప్లాంట్ విస్తరణలో భాగంగా రెండో యూనిట్‌కు కూడా సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.