ఏపీ ఎయిర్‌పోర్టుల్లో మద్యం అమ్మకాలు.

ఏపీ ఎయిర్‌పోర్టుల్లో మద్యం అమ్మకాలు

Advertisements

<p>ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ విధానంలో సరికొత్త మార్పులు చోటుచేసుకున్నాయి&period; ఏపీలోని అంతర్జాతీయ&comma; దేశీయ విమానాశ్రయాలలో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది&period; కొత్త ఎక్సైజ్ విధానంలో భాగంగా&period;&period; ఎయిర్‌పోర్టుల్లో వైన్ షాపులు&comma; బార్ల ఏర్పాటుకు అనుమతినిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది&period; ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 386 ప్రకారం&period;&period; తిరుపతి మినహా రాష్ట్రంలోని అన్ని ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ భవనాల్లో&comma; ప్లాజాల్లో మద్యం విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవచ్చు&period; విమాన సర్వీసులు అర్ధరాత్రి&comma; తెల్లవారుజామున కూడా ఉంటాయనే ఉద్దేశంతో&period;&period; ఈ దుకాణాలను 24 గంటలూ రౌండ్ ది క్లాక్ నడిపేందుకు అనుమతించారు&period; అయితే ఈ లైసెన్స్ ఎవరికి పడితే వారికి రాదు&period; ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్ సిఫారసు చేసిన దరఖాస్తుదారులకు మాత్రమే ఎక్సైజ్ శాఖ ఈ పర్మిట్లు మంజూరు చేస్తుంది&period; ఒకే లైసెన్స్ కింద బార్లకు గరిష్టంగా మూడు సర్వింగ్ పాయింట్లు&comma; షాపులకు మూడు కౌంటర్ల వరకు అవకాశం కల్పించారు&period;<&sol;p>&NewLine;<p>ఇక ఎయిర్‌పోర్ట్ మద్యం దుకాణాలకు లైసెన్స్ ఫీజులను కూడా భారీగానే నిర్ణయించారు&period; వైన్ షాపుల దరఖాస్తు రుసుముగా 2 లక్షల రూపాయలు&comma; వార్షిక ఎక్సైజ్ పన్నుగా ఏకంగా ఒక కోటి రూపాయలను ఖరారు చేశారు&period; ప్రయాణికుల రద్దీ ఆధారంగా బార్లను రెండు కేటగిరీలుగా విభజించారు&period; ఏడాదికి 20 లక్షల కంటే ఎక్కువ మంది ప్రయాణించే ఎయిర్‌పోర్టుల్లోని పెద్ద బార్లకు 25 లక్షల రూపాయలు&period;&period; 20 లక్షల కంటే తక్కువ మంది ఉండే చిన్న బార్లకు 15 లక్షల రూపాయలను వార్షిక పన్నుగా నిర్ణయించారు&period;<&sol;p>&NewLine;<p>నిబంధనల ప్రకారం ఎయిర్‌పోర్ట్ షాపులకు పర్మిట్ రూమ్ సదుపాయం ఉండదు&period; ప్రయాణికుల రాకపోకలు&comma; ఆదాయ వనరులను బట్టి&period;&period; ఈ నూతన పాలసీని మూడేళ్ల తర్వాత ప్రభుత్వం మళ్లీ సమీక్షించనుంది&period; ఆంధ్రప్రదేశ్ ఎయిర్‌పోర్టుల్లో మద్యం అమ్మకాలపై ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విజయేంద్ర ప్రసాద్ చేతులమీదుగా ఆవిష్కరించిన “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా పోస్టర్.

RAPO23 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్- రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం.

‘ఇరుముడి’ నుంచి గూస్‌బంప్స్ తెప్పించే డివైన్ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్.