నేడు ఉదయం 10.30 కి ఏపీ కేబినెట్ భేటీ.

Advertisements

<p>ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ ఉదయం 10&period;30 కి వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది&period; ఈ భేటీలో అమరావతి రాజధాని ప్రాంత ల్యాండ్ పూలింగ్ రైతులకు సంబంధించి ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది&period; ముఖ్యంగా రాజధాని విస్తరణ కోసం కొత్తగా భూములిచ్చే రైతులకు ఎకరానికి ఏడాదికి 40 వేల చొప్పున యాన్యుటీ చెల్లించే ప్రతిపాదనకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది&period; ఈ నిర్ణయం రాజధాని నిర్మాణానికి భూములిచ్చే రైతులకు ఆర్థికంగా ఎంతో ఊరటనివ్వనుంది&period; దీంతో పాటు&comma; రాజధాని పరిధిలోని గ్రామ కంఠాల్లో అక్రమణల తొలగింపు&comma; మాస్టర్ ప్లాన్ రోడ్ల విస్తరణ కారణంగా ఇళ్లు&comma; భూములు కోల్పోయిన బాధితులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది&period; ఇళ్లు కోల్పోయిన సదరు లబ్ధిదారులకు నెలకు 10 వేల చొప్పున అద్దె భత్యం ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది&period; ల్యాండ్ పూలింగ్ రైతులకు ప్రయోజనం చేకూర్చే ఈ నిర్ణయాలతో పాటు&comma; రాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానాలు&comma; ఐటీ పాలసీ&comma; పలు సంక్షేమ పథకాలపై కూడా ఈ కేబినెట్ భేటీలో సుదీర్ఘంగా చర్చించి తుది నిర్ణయాలు తీసుకోనున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కెనడాపై ట్రంప్ సంచలన నిర్ణయం.

అమెరికా వెళ్లే భారతీయ ఉద్యోగులకు భారీ షాక్.

శ్రీరంగంపట్నంలోని ఆలయంలో ఎంట్రీ విషయంలో వివాదం.