హాజరైన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్.

హాజరైన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్

Advertisements

<p>ఏపీలో బ్యాంకింగ్ సేవలను ప్రజల చెంతకు తీసుకెళ్లే దిశగా మరో కీలక అడుగు పడింది&period; పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహించిన మెగా క్రెడిట్ అవుట్‌రీచ్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు&comma; కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు&period; అర్హులైన రైతులు&comma; విద్యార్థులు&comma; మహిళలు&comma; చిన్న వ్యాపారులకు భారీ స్థాయిలో రుణాలు అందజేశారు&period; ప్రజల వద్దకే బ్యాంకులు వెళ్లి సేవలు అందించడం అభినందనీయమని సీఎం పేర్కొనగా&period;&period; ప్రతి గ్రామానికి బ్యాంకింగ్ సేవలను విస్తరించడం ప్రధాని మోదీ లక్ష్యమని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;<p>ప్రజల వద్దకే బ్యాంకులు వెళ్లి రుణాలు అందించడం గర్వకారణమని అన్నారు సీఎం చంద్రబాబు&period; పల్నాడు జిల్లా నరసరావుపేటలోని కోడెల శివప్రసాదరావు స్టేడియంలో ఏర్పాటు చేసిన క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌తో కలిసి సీఎం పాల్గొన్నారు&period; రైతులు&comma; విద్యార్థులు&comma; అర్హులైన పేదలందరికీ రుణం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు&period; సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు పెరిగితేనే నిజమైన అభివృద్ధి అని సీఎం చంద్రబాబు చెప్పారు&period; ఒక్క రోజే 1&period;04లక్షల మందికి బ్యాంకు రుణాలు అందించడం ఒక చరిత్రగా అభివర్ణించారు&period; బ్యాంకింగ్ వ్యవస్థలో కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్‌ విప్లవాత్మక మార్పులు తెచ్చారని&period;&period; ప్రధాని మోదీ వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ఎన్నో సంస్కరణలు అమలు చేస్తున్నారని సీఎం స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;<p>ప్రతి గ్రామానికి బ్యాంక్ సేవలు అందించడమే ప్రధాని మోదీ లక్ష్యమని అన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్&period; 2014 నుంచి గ్రామాలకు బ్యాంక్‌ సేవలను అందించే దిశగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు&period; కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నిరర్థక ఆస్తులతో బ్యాంకుల పనితీరు బాగుండేది కాదన్నారు&period; ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బ్యాంకింగ్ వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చామన్నారు&period; ప్రధాని మోదీ సూచనలతో ప్రజల వద్దకే బ్యాంకులు వెళ్తున్నాయని&period;&period; దీని వల్ల ఈరోజు లక్షల మందికి సులువుగా లోన్లు అందుతున్నాయని చెప్పారు&period; ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేస్తామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.

“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.

హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.