ఎంపీలతో సీఎం చంద్రబాబు సమావేశం.

Advertisements

<p>టీడీపీ అధినేత&comma; సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఆ పార్టీ పార్లమెంటరీ భేటీ జరిగింది&period; ఈనెల 20 నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలతో సీఎం చర్చించారు&period; వివిధ అంశాలపై వారికి దిశానిర్దేశం చేశారు&period; పోలవరం ప్రాజెక్టు పురోగతి&comma; కేంద్రం నుంచి రావాల్సిన నిధులు&comma; నిర్వాసితుల పునరావాస కార్యక్రమాలు&comma; రాజధాని నిర్మాణ పనులు&comma; మౌలిక సదుపాయాల కల్పన&comma; పెట్టుబడుల ఆకర్షణపై చంద్రబాబు సూచనలు చేశారు&period; రాయలసీమకు సాగునీటిని అందించేందుకు చేపట్టాల్సిన గోదావరి-పెన్నా అనుసంధాన ప్రక్రియ&comma; కార్యాచరణపై సీఎం దిశానిర్దేశం చేశారు&period; దక్షిణ కోస్తా రైల్వేజోన్‌కు సంబంధించిన మౌలిక సదుపాయాలు&comma; రైల్వే భూముల కేటాయింపు&comma; జోన్‌ పూర్తిస్థాయి కార్యకలాపాల ప్రారంభం అంశాలపై చర్చించారు&period; పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టే వివిధ చట్ట సవరణలు&comma; కొత్త బిల్లుల పట్ల పార్టీ అనుసరించాల్సిన విధానంపై సమావేశంలో చర్చ జరిగింది&period; నియోజకవర్గాల పునర్విభజన&comma; మహిళా బిల్లు&comma; ఎస్‌ఐఆర్‌ అంశాలపై నేతలతో సీఎం చర్చించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.

ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.

హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.