రాజకీయ కక్షసాధింపుతోనే అక్రమ కేసులు -రోజా.

Advertisements

<p>వైసీపీ మహిళా నేత&comma; మాజీ మంత్రి రోజాకు పోలీసులు నోటీసులు జారీ చేశారు&period; ఓ పత్రిక ప్రతులను దహనం చేసిన కేసులో విచారణకు హాజరుకావాలని ఆదేశించారు&period; చిత్తూరు జిల్లా నగరిలోని ఆమె నివాసానికి వెళ్లిన తిరుపతి ఈస్ట్ పోలీసులు&comma; ఈ నెల 30న విచారణకు రావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;<p>కొన్ని రోజుల క్రితం&comma; తమ పార్టీ నాయకుల కుటుంబాల్లోని మహిళలను కించపరిచేలా ఓ దినపత్రికలో అసత్య కథనాలు ప్రచురించారని ఆరోపిస్తూ రోజా నిరసన తెలిపారు&period; అందులో భాగంగా పత్రిక ప్రతులను దహనం చేశారు&period; ఈ ఘటనపై నమోదైన కేసులో భాగంగానే పోలీసులు తాజాగా నోటీసులు అందజేశారు&period;<&sol;p>&NewLine;<p>కూటమి ప్రభుత్వం తనపై రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని&comma; అందులో భాగంగానే అక్రమ కేసులు బనాయించిందని రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు&period; రాష్ట్రంలో ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని పక్కనపెట్టి&comma; కూటమి ప్రభుత్వం &&num;8216&semi;రెడ్ బుక్ రాజ్యాంగాన్ని&&num;8217&semi; అమలు చేస్తోందని తీవ్రంగా విమర్శించారు&period; వైసీపీ అధినేత జగన్ తో పాటు&comma; పార్టీ నాయకుల కుటుంబాల్లోని మహిళలను కించపరిచేలా ఓ పత్రికలో అవాస్తవ కథనాలు ప్రచురించారని&comma; అందుకే నిరసనగా ఆ పత్రిక ప్రతులను దహనం చేశామని స్పష్టం చేశారు&period; శాంతియుతంగా నిరసన తెలిపితే కేసులు పెట్టడం ఏమిటని ఆమె ప్రశ్నించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.