హిట్ అండ్ రన్ కేసులో జగన్ తీరుపై మంత్రి లోకేష్ ఆగ్రహం.

Advertisements

<p>వైఎస్ జగన్‌పై రాష్ట్ర మంత్రి లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు&period; శ్రీకాకుళం జిల్లాలో జరిగిన హిట్ అండ్ రన్ కేసులో బాధితుడి కుటుంబాన్ని విస్మరించి&comma; నిందితుడి కుటుంబ సభ్యులను పరామర్శించడంపై ఆయన మండిపడ్డారు&period; ఇది పరామర్శ కాదని&comma; నేరపూరిత మనస్తత్వానికి పరాకాష్ట అని లోకేష్ ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు&period; విచక్షణ ఉన్న ఏ నాయకుడైనా రోడ్డు ప్రమాదంలో మరణించిన దానయ్య కుటుంబాన్ని పరామర్శించి అండగా నిలుస్తారని&&num;8230&semi; అయితే జగన్ మాత్రం బాధితులను వదిలి నిందితుల పక్షాన నిలిచారని లోకేష్ విమర్శించారు&period;<&sol;p>&NewLine;<p>శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన జగన్&comma; హిట్ అండ్ రన్ కేసులో సాక్ష్యాలు తారుమారు చేశారన్న ఆరోపణలతో జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును కలిసేందుకు వెళ్లారు&period; అయితే&comma; ఆయన సాయంత్రం 5 గంటల తర్వాత చేరుకోవడంతో జైలు అధికారులు అనుమతించలేదు&period; జగన్ చర్యలపై లోకేష్ తీవ్రంగా స్పందించారు&period; మనస్సాక్షి ఉన్న ఏ నాయకుడైనా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బీసీ సోదరుడు దానయ్య కుటుంబాన్ని పరామర్శించి అండగా నిలుస్తారు&period; కానీ హిట్ అండ్ రన్ కేసులో ఒక నిండు ప్రాణం బలైన ఘటనలో మృతుని కుటుంబాన్ని విస్మరించి&comma; నిందితుల కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన జగన్ రెడ్డి తీరు అమానవీయ ప్రవర్తనకు నిదర్శనమన్నారు&period; ప్రపంచ రాజకీయ చరిత్రలోనే బాధితులను వదిలేసి&comma; నిందితులకు అండగా నిలిచే రాజకీయం చేయడం బహుశా జగన్ రెడ్డికే చెల్లిందని ఎద్దేవా చేశారు&period; ఇది పరామర్శ కాదు&comma; నేర మనస్తత్వానికి పరాకాష్ట అని దుయ్యబట్టారు మంత్రి నారా లోకేశ్&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.