ఏపీలో సామాన్యులకు ఊరటనిస్తూ తక్కువ ధరకే బియ్యం.

Advertisements

<p>రాష్ట్రంలోని సామాన్య&comma; మధ్యతరగతి ప్రజలకు ఊరట కల్పిస్తూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది&period; బహిరంగ మార్కెట్‌లో పెరుగుతున్న బియ్యం ధరలను నియంత్రించేందుకు&comma; తక్కువ ధరకే నాణ్యమైన బియ్యాన్ని అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది&period; రాష్ట్రవ్యాప్తంగా 130 రైతు బజార్లు&comma; 500 రైస్ మిల్లుల వద్ద ప్రత్యేక కౌంటర్ల ద్వారా సబ్సిడీ బియ్యం విక్రయాలను ప్రారంభించింది&period; విజయవాడలోని ఏపీఐఐసీ రైతు బజార్‌లో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి&comma; ప్రజలకు స్వయంగా బియ్యాన్ని అందజేశారు&period; బీపీటీ సూపర్ ఫైన్ రకం బియ్యాన్ని కిలో 52 రూపాయలు&comma; బీపీటీ à°°à°¾ రైస్‌ను కిలో 50కే విక్రయిస్తున్నారు&period; ఆధార్ కార్డు చూపించి ఒక వ్యక్తి 10 కిలోల వరకు బియ్యం కొనుగోలు చేయవచ్చు&period; బహిరంగ మార్కెట్‌లో 60 నుంచి 65 రూపాయల వరకు పలుకుతున్న ఈ రకం బియ్యాన్ని ప్రభుత్వం తక్కువ ధరకే అందుబాటులోకి తేవడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు&period; రాష్ట్ర పౌరసరఫరాల శాఖ&comma; రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి&period;<br &sol;>&NewLine;ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ&period;&period; &&num;8220&semi;ప్రజలకు కష్టం రాకముందే వారిని ఆదుకునే ప్రభుత్వం తమదన్నారు&period; మార్కెట్‌లో బియ్యం ధరలను సమీక్షించి&comma; సామాన్యుడిపై భారం పడకుండా తక్కువ ధరకే బియ్యం అందించాలని నిర్ణయించామన్నారు&period; ప్రభుత్వ విజ్ఞప్తికి రైస్ మిల్లర్లు సానుకూలంగా స్పందించి సహకరించడం అభినందనీయమని తెలిపారు&period; భవిష్యత్తులో కందిపప్పు&comma; పామాయిల్‌ను కూడా తక్కువ ధరలకు అందించేందుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నామని ఆయన వెల్లడించారు&period; ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “రణబాలి” మూవీ.

సెమీకాన్‌ ఇండియా-2026 ప్రారంభించిన మోదీ.

జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి.