గోదావరి ఉధృతితో కొత్త నరసాపురం జలదిగ్బంధం.

Advertisements

<p>గోదావరి వరద ఉధృతి పశ్చిమగోదావరి జిల్లాలోని పలు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతోంది&period; నరసాపురం మండలం కొత్త నవరాసపురంలోని యానాదుల కాలనీ పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది&period; వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు&period; తాగునీరు&comma; ఆహారం వంటి కనీస అవసరాల కోసం అవస్థలు పడుతున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period; ఇప్పటివరకు అధికారులు గానీ&comma; ప్రజాప్రతినిధులు గానీ తమ కాలనీని సందర్శించి సమస్యలను పట్టించుకోలేదని వారు ఆరోపిస్తున్నారు&period; వెంటనే సహాయక చర్యలు చేపట్టి సురక్షిత తాగునీరు&comma; నిత్యావసర వస్తువులు అందించడంతో పాటు వరద ప్రభావిత కుటుంబాలకు అవసరమైన సహాయాన్ని అందించాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు&period; దీనిపై మరింత సమాచారాన్ని మా జిల్లా ప్రతినిధి ఆనంద్ కుమార్ అందిస్తారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.