పవన్ కళ్యాణ్‌కు విద్యార్థుల భవిష్యత్తు పట్టదు – మల్లాది విష్ణు.

Advertisements

<p>కూటమి పాలనలో విద్యావ్యవస్థ తీవ్రంగా నష్టపోయిందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు&period; సెంట్రల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో ముఖ్య నాయకులు&comma; కార్యకర్తలతో టౌన్ హాల్ సమావేశం సింగ్ నగర్ లోని గుజ్జుల సరళ దేవి కళ్యాణ మండలంలో నిర్వహించారు&period; జేఎన్‌టీయూ ముట్టడి కార్యక్రమానికి ముందే ఫీజు రీయింబర్స్‌మెంట్&comma; విద్యార్థుల సమస్యలపై వైఎస్సార్‌సీపీ పకడ్బందీగా పోరాటాలు చేసిందని తెలిపారు&period; అన్యాయానికి గురై ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థి కుటుంబాలకు అండగా నిలబడి ఈ ఉద్యమాన్ని ఒక మోడల్‌గా తీర్చిదిద్దామని పేర్కొన్నారు&period; విద్యాశాఖ మంత్రి లోకేష్ తన పదవికి రాజీనామా చేసే వరకు ఈ పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;<p>కూటమి ప్రభుత్వంలో అమ్మఒడి&comma; ఫీజు రీయింబర్స్‌మెంట్ నిలిచిపోవడంతో విద్యార్థులు&comma; యువత తీవ్రంగా నష్టపోయారని దేవినేని అవినాష్ ఆవేదన వ్యక్తం చేశారు&period; గత వైఎస్ జగన్ పాలనలో కరోనా వంటి క్లిష్ట సమయంలోనూ సంక్షేమ పథకాలను నిరంతరాయంగా అందించామని చెప్పారు&period; ప్రస్తుత ప్రభుత్వం డీఎస్సీ అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లుతూ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు&period; రాష్ట్రంలో కూటమి నేతల అహంకారాన్ని దించే శక్తి ఒక్క యువతకే ఉందన్న ఆయన&comma; రాబోయే 2029 ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా ఉద్యమించాలని దేవినేని అవినాష్ పిలుపునిచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.