సీఎం చంద్రబాబు అధ్యక్షతన 64వ CRDA సమావేశం.

Advertisements

<p>రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ అథారిటీ 64à°µ సమావేశం జరిగినట్లు మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు&period; ఈ సమావేశంలో రాజధాని ప్రాంత అభివృద్ధికి సంబంధించి సీఆర్డీఏ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు&period; ఇన్నర్ రింగ్ రోడ్డు&comma; రైల్వే లైన్ నిర్మాణం కోసం మోతడక గ్రామంలో 2&comma;340 ఎకరాల భూమిని కేటాయించేందుకు గతంలో తీర్మానం చేశామని&comma; దానికి నేడు అథారిటీ ఆమోదం తెలిపిందన్నారు&period;<&sol;p>&NewLine;<p>పల్నాడు జిల్లాలో దేవదాయశాఖకు చెందిన 244&period;39 ఎకరాల ఇనాం భూములను ల్యాండ్ పూలింగ్‌లో చేర్చేందుకు సీఆర్డీఏ పచ్చజెండా ఊపిందన్నారు మంత్రి&period; ఇందుకు రూ&period;122 కోట్లు చెల్లించేందుకు అంగీకారం తెలిపినట్లు చెప్పారు&period; 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టును ప్రారంభించామని&comma; కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని తిరిగి చేపట్టినట్లు నారాయణ పేర్కొన్నారు&period; ఆంధ్రప్రదేశ్ రేరాకు రెన్యూవల్ ఫీజును రద్దు చేసేందుకు కూడా సీఆర్డీఏ అంగీకారం తెలిపిందన్నారు&period; రైతులకు యాన్యుటీ కింద గత నెలలో రూ&period;300 కోట్లు చెల్లించామని మంత్రి తెలిపారు&period; ఇందుకోసం తీసుకున్న రుణానికి ర్యాటిఫికేషన్ ఇచ్చామని చెప్పారు&period; డేటా సెంటర్‌కు 9 గిగావాట్ల సామర్థ్యానికి టెండర్లు పిలిచేందుకు అనుమతి ఇచ్చినట్లు నారాయణ పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.