గుడిబండ చెరువులో అక్రమ ఇసుక తవ్వకాలు.

Advertisements

<p>శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని గుడిబండ చెరువులో అక్రమ ఇసుక తవ్వకాలు పర్యావరణానికి తీవ్ర ముప్పుగా మారాయి&period; విచ్చలవిడిగా ఇసుక తవ్వడంతో చెట్ల వేర్ల వ్యవస్థ దెబ్బతిని పెద్ద ఎత్తున నీలగిరి చెట్లు నేలకూలుతున్నాయి&period; ఇప్పటికే దాదాపు 50కిపైగా చెట్లు వేర్లు బయటపడి ఎండిపోయే పరిస్థితికి చేరుకున్నాయి&period; ప్రతిరోజూ యంత్రాలతో ఇసుకను తవ్వి పక్క రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి&period; అధికారులు తెలిసినా చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు&period; గతంలో వైరల్ అయిన వీడియోలపై కూడా తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపణలు ఉన్నాయి&period; అయితే అక్రమ ఇసుక తవ్వకాలు&comma; రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచామని&comma; నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మడకశిర గ్రామీణ సీఐ రాజ్‌కుమార్ స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.