అనకాపల్లి జిల్లాలో కైట్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కాలేజ్‌ మాయం.

Advertisements

<p>అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం ఆవసోమవారం గ్రామంలో ఉండాల్సిన కైట్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కనిపించకపోవడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది&period; జీవో ఎంఎస్ నంబర్లు 140&comma; 143 ప్రకారం కైట్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్&comma; బీఎస్సీ నర్సింగ్ కోర్సులకు అనుమతులు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి&period; 2023లో అనుమతులు పొందిన ఈ కళాశాలకు బీఎస్సీ నర్సింగ్‌లో ఏడాదికి 60 సీట్లు&comma; జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీకి మరో 60 సీట్లకు అనుమతులు ఉన్నట్లు తెలుస్తోంది&period;అయితే&period;&period; అనుమతులు పొందిన కళాశాల వాస్తవంగా ఎక్కడ నిర్వహించబడుతోంది&quest; అక్కడ విద్యార్థులు చదువుతున్నారా&quest; కళాశాలలో అవసరమైన మౌలిక వసతులు&comma; ఫైర్ సేఫ్టీ&comma; క్లినికల్ అఫిలియేషన్&comma; పరికరాలు&comma; బోధనా సిబ్బంది&comma; ఇతర సిబ్బంది ఉన్నారా&quest; అన్న ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి&period;<br &sol;>&NewLine;రవి ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ పేరుతో మూడు కళాశాలలకు అనుమతులు పొందినట్లు పేర్కొంటుండగా&comma; కైట్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు జమ అవుతున్నాయన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి&period; అసలు కళాశాల ఉనికిపైనే అనుమానాలు ఉంటే&period;&period; ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎలా జరుగుతోందన్న ప్రశ్నలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి&period;<br &sol;>&NewLine;డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్&comma; ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ మెడికల్ కౌన్సిల్&comma; అనకాపల్లి డీఎంహెచ్‌వో అధికారుల పరిశీలన&comma; భౌతిక తనిఖీలపై కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది&period; కైట్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌పై పూర్తిస్థాయి ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహిస్తే అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి&period;ఈ వ్యవహారంపై సీవీఆర్ న్యూస్ నిఘా బృందం మరిన్ని వివరాలను సేకరిస్తోంది&period; అధికారిక రికార్డులు&comma; అనుమతులు&comma; ఫిజికల్ వెరిఫికేషన్ అంశాలపై మరింత సమాచారం వెలుగులోకి రానుంది&period;<br &sol;>&NewLine;కైట్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వ్యవహారంలో అసలు నిజమేంటి&quest; ఎవరి పర్యవేక్షణలో అనుమతులు వచ్చాయి&quest; ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎలా జరిగింది&quest; మరిన్ని వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకొచ్చే దిశగా సీవీఆర్ న్యూస్ నిఘా బృందం పరిశోధన కొనసాగిస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

టీడీపీ యూనిట్ ఇంఛార్జ్‌ల కోసం శిక్షణా తరగతులు.

ఇరాన్, రష్యాపై ఆంక్షల బిల్లుకు US సెనెట్ గ్రీన్ సిగ్నల్.

తిరుపతిలో మద్యం మత్తులో లారీ డ్రైవర్ బీభత్సం.