లక్ష్మీదేవిపేట రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ ప్రదేశం పరిశీలన.

Advertisements

<p>అనకాపల్లి జిల్లా కేంద్రంలో గత 20 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న లక్ష్మీదేవిపేట రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి మళ్లీ కదలిక వచ్చింది&period; రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ ప్రదేశాన్ని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్&comma; ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పరిశీలించారు&period;గత రెండు దశాబ్దాలుగా బ్రిడ్జి నిర్మాణం పూర్తికాకపోవడంతో స్థానిక ప్రజలు&comma; వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నేతలు తెలిపారు&period; ప్రభుత్వాలు మారడం&comma; నిర్మాణ వ్యయం పెరగడం&comma; రైల్వే జోన్ ఏర్పాటుతో అధికారుల మార్పులు వంటి పలు కారణాలతో పనులు ఆలస్యమయ్యాయని ఎంపీ సీఎం రమేష్ వెల్లడించారు&period;ఇక ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చర్యలు చేపట్టామని తెలిపారు&period; రైల్వే శాఖ ఆధ్వర్యంలో త్వరలోనే టెండర్లు పిలిచి&period;&period; సుమారు 90 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు చెప్పారు&period; పనులు ప్రారంభమైన తర్వాత 18 నెలల్లో బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని ఎంపీ సీఎం రమేష్ వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

టీడీపీ యూనిట్ ఇంఛార్జ్‌ల కోసం శిక్షణా తరగతులు.

ఇరాన్, రష్యాపై ఆంక్షల బిల్లుకు US సెనెట్ గ్రీన్ సిగ్నల్.

తిరుపతిలో మద్యం మత్తులో లారీ డ్రైవర్ బీభత్సం.