చేనేతకు అండగా ఎన్డీయే ప్రభుత్వం-చంద్రబాబు.

Advertisements

<p>చేనేత భారతదేశ గర్వకారణమని&&num;8230&semi; ఆ కళను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు&period; జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లా చీరాలలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న సీఎం&&num;8230&semi; చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు&period; చేనేత రంగానికి చేయూతగా ఇప్పటికే పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని&comma; భవిష్యత్తులో మరిన్ని చర్యలు చేపడతామని ప్రకటించారు&period; దేశానికి గుర్తింపు తీసుకొచ్చిన కళల్లో చేనేతకు ప్రత్యేక స్థానం ఉందన్నారు చంద్రబాబు నాయుడు&period; జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చీరాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన&&num;8230&semi; చేనేత కళను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు&period; తెలుగు నేత కార్మికుల నైపుణ్యం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిందని సీఎం పేర్కొన్నారు&period; అగ్గిపెట్టెలో పట్టే చీరను తయారు చేసిన ఘనత మన నేత కార్మికులదేనని గుర్తు చేశారు&period; ఒకప్పుడు చీరాల కర్చీఫ్‌లు విదేశాలకు ఎగుమతి అయ్యేవని&&num;8230&semi; అందుకే చీరాలను మినీ ముంబయిగా పిలిచేవారని చెప్పారు&period;<&sol;p>&NewLine;<p>రాష్ట్రంలో లక్షా 27 వేల మందికి పైగా చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు&period; అధికారంలో ఉన్నా&&num;8230&semi; ప్రతిపక్షంలో ఉన్నా నేత కార్మికులు తెలుగుదేశం పార్టీని ఆదరించారని పేర్కొన్నారు&period; చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తోందన్నారు చంద్రబాబు&period; సబ్సిడీపై విద్యుత్ సరఫరా&comma; 50 ఏళ్లకే పెన్షన్&comma; ఏడాదికి రూ&period;25 వేల ఆర్థిక సహాయం వంటి పథకాలు ఇప్పటికే అమల్లో ఉన్నాయని వెల్లడించారు&period; చేనేత రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఉప్పాడలో ప్రత్యేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టు&comma; మంగళగిరిలో హ్యాండ్లూమ్ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు&period; సంప్రదాయ చేనేతకు ఆధునిక మార్కెటింగ్ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు&period;<br &sol;>&NewLine;ఎన్డీయే ప్రభుత్వం బీసీల అభివృద్ధికి కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు&period; సంజీవని పథకం ద్వారా 2&period;50 లక్షల ఆరోగ్య బీమా అందిస్తున్నామని&&num;8230&semi; అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు&period; ప్రజలకు ఇబ్బంది లేని పాలన అందిస్తామని ఇచ్చిన హామీని రెండేళ్లలోనే నిలబెట్టుకున్నామని చంద్రబాబు తెలిపారు&period;<br &sol;>&NewLine;చేనేత కళను కాపాడుతూ&&num;8230&semi; నేత కార్మికుల ఆదాయాన్ని పెంచే దిశగా ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేయడంతో&&num;8230&semi; చేనేత రంగంలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

టీడీపీ యూనిట్ ఇంఛార్జ్‌ల కోసం శిక్షణా తరగతులు.

ఇరాన్, రష్యాపై ఆంక్షల బిల్లుకు US సెనెట్ గ్రీన్ సిగ్నల్.

తిరుపతిలో మద్యం మత్తులో లారీ డ్రైవర్ బీభత్సం.