టీడీపీ యూనిట్ ఇంఛార్జ్‌ల కోసం శిక్షణా తరగతులు.

Advertisements

<p>ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని&comma; అదే సమయంలో గొడ్డలి పార్టీ చేస్తున్న కుట్రలు&comma; దుష్ప్రచారాలను ఎప్పటికప్పుడు సమర్థంగా తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి&comma; టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు&period; తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో యూనిట్ ఇంఛార్జ్‌à°² కోసం నిర్వహించిన శిక్షణా తరగతులకు ఆయన హాజరై ప్రసంగించారు&period; కార్యకర్తల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకే ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని&comma; పార్టీ భావజాలాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగాలని సూచించారు&period;<&sol;p>&NewLine;<p>ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజలకు వివరించాలని సూచించారు&period; అలా చేయకపోతే&comma; తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మే ప్రమాదం ఉంటుందని&&num;8230&semi; అందుకే చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నారు&period; గొడ్డలి పార్టీ చేసే కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని స్పష్టం చేశారు&period; ఇటీవల డీఎస్సీ పరీక్షల నిర్వహణలో గొడ్డలి పార్టీ దుష్ప్రచారం చేసేందుకు ప్రయత్నించిందని&comma; అయితే దానికి ప్రభుత్వం గట్టిగా కౌంటర్లు ఇవ్వగలిగిందని గుర్తుచేశారు&period; పరీక్షల నిర్వహణలో ఎలాంటి తప్పిదాలు జరగలేదన్న వాస్తవాలు చెప్పడం వల్లే&period;&period; గొడ్డలి పార్టీ మినహా కొన్ని ఇతర పార్టీలకు చెందిన నేతలు కూడా తప్పులు జరగలేదని బహిరంగంగా చెబుతున్నారని చెప్పారు&period; ఇప్పుడు అదే డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన టీచర్లే గొడ్డలి పార్టీ తీరును తప్పుపడుతూ ఆందోళనలు చేపట్టారని చంద్రబాబు వివరించారు&period;<&sol;p>&NewLine;<p>ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించి వాస్తవాలు ప్రజల ముందు ఉంచితే&comma; కుట్రలను వారే ఛేదిస్తారని అన్నారు&period; దీనికి కర్నూల్‌లో టీచర్లు గొడ్డలి పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనే నిదర్శనమని తెలిపారు&period; మంచి పనులు చేస్తే ప్రజలు సహకరించి భాగస్వాములు అవుతారనడానికి భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవమే ఉదాహరణ అని పేర్కొన్నారు&period; రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఇటీవలే ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చానని&comma; ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వ్యవస్థలను గాడిలో పెడుతూ సంక్షేమం-అభివృద్ధిని సమంగా ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు&period;<&sol;p>&NewLine;<p>సాధారణ కార్యకర్త నుంచి అగ్ర నాయకుడి వరకు అందరికీ పార్టీనే సుప్రీం అని చంద్రబాబు స్పష్టం చేశారు&period; కార్యకర్తలను పట్టించుకోని వారిని&comma; పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వెళ్లే వారి విషయంలో &&num;8216&semi;జీరో టాలరెన్స్&&num;8217&semi; పాటిస్తామని హెచ్చరించారు&period; ప్రతి నియోజకవర్గంలో ఏం జరుగుతుందో తాను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నానని అన్నారు&period; గొడ్డలి పార్టీ రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని ధీమా వ్యక్తం చేశారు&period; భవిష్యత్తులో ఏ ఎన్నికలు జరిగినా&comma; ప్రతి బూత్‌లోనూ గత ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు సాధించాలని లక్ష్యంగా నిర్దేశించారు&period; ప్రభుత్వ అధికారి&comma; ప్రజాప్రతినిధి&comma; నాయకుడి ప్రవర్తన ఓట్లపై ప్రభావం చూపుతుందని&comma; యూనిట్&comma; క్లస్టర్ ఇంఛార్జ్‌లకు&comma; మండల అధ్యక్షులకు తగిన గౌరవం దక్కేలా చూస్తామని హామీ ఇచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఇరాన్, రష్యాపై ఆంక్షల బిల్లుకు US సెనెట్ గ్రీన్ సిగ్నల్.

తిరుపతిలో మద్యం మత్తులో లారీ డ్రైవర్ బీభత్సం.

తెలంగాణలో మద్యం ధరల పెంచే యోచనలో ప్రభుత్వం.