ఓయూలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు.

Advertisements

<p>ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉస్మానియా యూనివర్సిటీలో ఆదివాసీ స్టూడెంట్స్ ఫోరం ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు&period; రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ ఆధ్వర్యంలో ఓయూ ఎన్‌సీసీ గేట్ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు&period; సంప్రదాయ దుస్తుల్లో పాల్గొన్న విద్యార్థులు ఆదివాసీ సంస్కృతి&comma; సంప్రదాయాలను ప్రతిబింబించే నృత్యాలు&comma; సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు&period; ఈ సందర్భంగా ఆదివాసీ యువత విద్య&comma; ఉద్యోగ రంగాల్లో మరింత ముందుకు రావాలని పిలుపునిచ్చారు&period; రాజ్యాంగం కల్పించిన హక్కులు&comma; రిజర్వేషన్లను సమర్థంగా అమలు చేయాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు&period; ఆదివాసీ సంస్కృతి&comma; వారసత్వాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు&period; విద్య&comma; ఉపాధితో పాటు భూమి&comma; అటవీ హక్కులకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వాలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’..

అమరావతి నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు.

నాకు ముప్పుందన్నారు.. అందుకే విమానం మారా -ట్రంప్