ఏపీలో పోలీసులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..

Advertisements

<p>ఏపీలో శాంతిభద్రతల పరిరక్షణపై సీఎం చంద్రబాబు రాష్ట్ర సచివాలయం నుంచి అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు&period; ఈ సమావేశంలో హోం మంత్రి అనిత&comma; డీజీపీ హరీష్ కుమార్ గుప్తా &comma; ఇతర ఉన్నతాధికారులు నేరుగా పాల్గొనగా&comma; రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేంజ్ ఐజీలు&comma; డీఐజీలు&comma; జిల్లాల ఎస్పీలు&comma; డీఎస్పీలు&comma; ఇన్‌స్పెక్టర్లు &comma; ఎస్ఐలు వర్చువల్ విధానంలో హాజరయ్యారు&period; మొత్తం 1&comma;200కు పైగా పోలీస్ స్టేషన్ల నుంచి స్టేషన్ హౌస్ ఆఫీసర్లు &lpar;SHOs&rpar; సహా దాదాపు 1&comma;650 మంది అధికారులు ఒకేసారి ఈ వర్చువల్ సమావేశంలో పాలుపంచుకోవడం విశేషం&period; ఈ సందర్భంగా క్షేత్రస్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు అందరికీ రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ స్టేషన్ల పనితీరు&comma; కేసులు నమోదు చేసే తీరు &comma; ప్రజలకు వేగంగా న్యాయం అందించే ప్రక్రియపై సీఎం దిశా నిర్దేశం చేశారు&period;<&sol;p>&NewLine;<p>రాష్ట్రంలో మహిళలు&comma; చిన్నారులపై జరుగుతున్న నేరాల నియంత్రణతో పాటు సైబర్ క్రైమ్స్&comma; బ్లేడ్ బ్యాచ్‌లు&comma; గంజాయి ముఠాల ఆగడాలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేయాలని ముఖ్యమంత్రి పోలీసు యంత్రాంగాన్ని కఠినంగా ఆదేశించారు&period; సోషల్ మీడియాలో జరుగుతున్న ఫేక్ ప్రచారాలను అరికట్టేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు&period; వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదవుతున్న కేసుల పురోగతిని సమీక్షిస్తూ&comma; సమాజంలో భయాందోళనలు సృష్టిస్తూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై ఎలాంటి దాక్షిణ్యం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు&period; ఫ్రెండ్లీ పోలీసింగ్ కొనసాగిస్తూనే నేరస్థుల పట్ల సింహస్వప్నంగా వ్యవహరించాలని&comma; రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని సీఎం రేవంత్ తరహాలోనే ఉన్నతాధికారులను హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’..

అమరావతి నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు.

నాకు ముప్పుందన్నారు.. అందుకే విమానం మారా -ట్రంప్