ఉప్పాడ తీర రక్షణకు కీలక ముందడుగు.

Advertisements

<p>కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ తీర రక్షణకు కీలక ముందడుగు పడింది&period; సముద్ర కోతతో తీవ్రంగా దెబ్బతింటున్న ఉప్పాడ తీర ప్రాంత పరిరక్షణ కోసం ఐఐటీ మద్రాస్‌తో అవగాహన ఒప్పందం కుదిరింది&period; ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో మంగళగిరి క్యాంపు కార్యాలయంలో ఈ ఎంఓయూపై ఒప్పందం జరిగింది&period; తీర రక్షణ గోడకు సంబంధించిన డిజైన్&comma; సమగ్ర ప్రాజెక్టు నివేదిక&comma; సాంకేతిక పర్యవేక్షణ బాధ్యతలను ఐఐటీ మద్రాస్ నిర్వహించనుంది&period; 323 కోట్లతో ప్రతిష్టాత్మక తీర రక్షణ గోడ నిర్మాణాన్ని చేపట్టనున్నారు&period;<br &sol;>&NewLine;కేంద్ర ప్రభుత్వ విపత్తు నిర్వహణ నిధి ఆమోదంతో ఈ ప్రాజెక్టు అమలు కానుంది&period; రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ నోడల్ ఏజెన్సీగా&comma; ఏపీ మారిటైమ్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా వ్యవహరించనున్నాయి&period;సముద్ర ప్రవాహాలు&comma; అలల ప్రభావం&comma; తీర కోత తీవ్రతపై శాస్త్రీయ అధ్యయనం చేసి నిర్మాణ డిజైన్‌ను సిద్ధం చేయనున్నారు&period; అధికారిక ఒప్పంద ప్రక్రియ పూర్తికావడంతో రానున్న నవంబర్ నుంచి పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు&period; ఉప్పాడ తీర ప్రాంత ప్రజలు&comma; మత్స్యకార గ్రామాల రక్షణకు ఈ ప్రాజెక్టు అత్యంత కీలకమని అధికారులు భావిస్తున్నారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’..

అమరావతి నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు.

నాకు ముప్పుందన్నారు.. అందుకే విమానం మారా -ట్రంప్