ఆగస్టు చివరి నాటికి నల్లమల సాగర్‌కు వెలిగొండ జలాలు.

Advertisements

<p>ఆగస్టు చివరి నాటికి పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు తొలి విడత పనులు పూర్తి చేసి నల్లమల సాగర్‌కు నీటిని విడుదల చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు&period; మార్కాపురం కలెక్టరేట్‌లో వెలిగొండ పనుల పురోగతి&comma; నిర్వాసితుల పునరావాసం&comma; ముంపు గ్రామాల తరలింపుపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు&period; నిర్వాసితుల కోసం ప్రకటించిన 900 కోట్ల రూపాయల ప్యాకేజీలో ఇప్పటికే 318 కోట్ల రూపాయలను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు&period; అర్హులైన ఏ ఒక్క నిర్వాసితుడికీ అన్యాయం జరగనివ్వబోమని హామీ ఇచ్చారు&period; సాగు&comma; తాగునీటితో పాటు మార్కాపురాన్ని పారిశ్రామిక&comma; హార్టీకల్చర్ హబ్‌గా అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సింహాచలంలో వైభవంగా శ్రావణ శుక్రవారం పూజలు.

బాలానగర్‌లో గంజాయి ముఠాపై తెలంగాణ ఈగల్ భారీ ఆపరేషన్.

అత్యల్ప ఉత్పాదకతతో ముగిసిన లోక్‌సభ వర్షాకాల సమావేశాలు.