నేడు, రేపు చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు.

Advertisements

<p>సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు&comma; రేపు కలెక్టర్ల సదస్సు జరగనుంది&period; గతంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సుల్లో తీసుకున్న నిర్ణయాల అమలు&comma; వాటిపై చేపట్టిన చర్యలు&comma; పురోగతికి సంబంధించిన నివేదికలపై సీఎం సమీక్షించనున్నారు&period; జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ధి&comma; సంక్షేమ కార్యక్రమాల అమలుపై అధికారులతో చర్చించనున్నారు&period; తొలి రోజు రాష్ట్ర ఆర్థికాభివృద్ధి&comma; GSDP&comma; స్వర్ణాంధ్ర విజన్‌&comma; సూపర్‌ సిక్స్‌ హామీల అమలు వంటి అంశాలపై ప్రధానంగా చర్చ జరగనుంది&period;<&sol;p>&NewLine;<p>తాగునీటి సరఫరా&comma; గృహ నిర్మాణం&comma; విద్య&comma; వైద్యం వంటి రంగాల్లో జిల్లా వారీగా పురోగతిని అధికారులు సీఎంకు వివరించనున్నారు&period; ప్రభుత్వ పథకాల అమలులో ఎదురవుతున్న సమస్యలు&comma; వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు&period; జిల్లాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు&period;&period; ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సమర్థంగా అందేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు సూచనలు చేయనున్నారు&period;<&sol;p>&NewLine;<p>రెండో రోజు ఇ-గవర్నెన్స్‌&comma; ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ల పరిష్కారం&comma; RTGS తదితర అంశాలపై సమీక్ష నిర్వహించనున్నారు&period; ప్రజా సమస్యలు&comma; ఫిర్యాదుల పరిష్కారంలో అధికారుల పనితీరును కూడా చంద్రబాబు పరిశీలించనున్నారు&period; శాంతిభద్రతల పరిస్థితిపై జిల్లాల వారీగా సమీక్షించి&period;&period; పోలీసు&comma; పరిపాలనా యంత్రాంగం సమన్వయంతో పనిచేసేలా కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు.. లోకేశ్ నిరసన.

సంక్షేమంపై మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదు: కొండపల్లి.

భూమికి సంపూర్ణ భద్రతే కూటమి ప్రభుత్వ లక్ష్యం.