భూమికి సంపూర్ణ భద్రతే కూటమి ప్రభుత్వ లక్ష్యం.

Advertisements

<p>సంక్షేమం&comma; అభివృద్ధి&comma; సుపరిపాలన అనే మూడు మూల మంత్రాలతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు&period; సచివాలయానికే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య ఉంటూ వారి జీవితాల్లో వెలుగులు నింపడమే అసలైన సుపరిపాలన అని అన్నారు&period; కోనసీమ జిల్లా పి&period;గన్నవరం నియోజకవర్గంలోని మాచడవ పండువారిపేటలో నిర్వహించిన &OpenCurlyQuote;మీ భూమి–మీ హక్కు’ గ్రామసభలో పాల్గొన్న చంద్రబాబు&period;&period; ప్రతి వారం ప్రజల వద్దకు వెళ్లి వారి బాగోగులు తెలుసుకుంటూ పాలన సాగిస్తున్నామని తెలిపారు&period; ప్రతినెలా 1à°µ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందిస్తూ పేదల సమస్యలు తెలుసుకుంటున్నామని చెప్పారు&period;<&sol;p>&NewLine;<p>భూమికి సంపూర్ణ భద్రత కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు పేర్కొన్నారు&period; ప్రతి నెలా 9à°µ తేదీన &OpenCurlyQuote;మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమం ద్వారా రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్‌బుక్‌లు అందిస్తున్నామని తెలిపారు&period; పటిష్ఠమైన రీసర్వే ప్రక్రియను చేపట్టి బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ&comma; ఈ-కేవైసీ&comma; క్యూఆర్‌ కోడ్ వంటి భద్రతా ఫీచర్లతో పాస్‌బుక్‌లు ఇస్తున్నామని వివరించారు&period; ఇప్పటివరకు 8&comma;234 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేసి 36 లక్షల మందికి పాస్‌బుక్‌లు అందించామని&comma; వచ్చే ఏడాది మార్చి నాటికి మరో 8&comma;582 గ్రామాల్లో సర్వే పూర్తి చేసి మొత్తం 56 లక్షల పాస్‌బుక్‌లు అందించడమే లక్ష్యమని వెల్లడించారు&period;<&sol;p>&NewLine;<p>గత ప్రభుత్వ హయాంలో రెవెన్యూ వ్యవస్థలో జరిగిన అవకతవకలను సరిదిద్దుతున్నామని సీఎం అన్నారు&period; రాష్ట్రవ్యాప్తంగా 16 లక్షల ఎకరాలను 22ఏ జాబితా నుంచి తొలగించి ప్రజలకు ఊరట కల్పించామని తెలిపారు&period; భూమి భద్రతతో పాటు నీటి భద్రతకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు&period; గోదావరి నుంచి వెయ్యి టీఎంసీలకు పైగా నీరు సముద్రంలో కలిసిపోతోందని&comma; పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు&period; ఈ సందర్భంగా ఈపీడీసీఎల్‌ ఆధ్వర్యంలో రూ&period;240 కోట్లతో చేపట్టనున్న గ్రిడ్ ఆధునీకరణ&comma; 3-ఫేజ్ విద్యుత్ సరఫరా పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.

“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.

హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.