సంక్షేమంపై మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదు: కొండపల్లి.

Advertisements

<p>సంక్షేమం గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదని రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమలు&comma; ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు&period; కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమన్నారు&period; ఎన్నికల హామీ మేరకు సీఎం చంద్రబాబు పెన్షన్‌ను రూ&period;3 వేల నుంచి రూ&period;4 వేలకు పెంచి మాట నిలబెట్టుకున్నారని తెలిపారు&period; మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు&period;<&sol;p>&NewLine;<p>గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో పెన్షన్‌ను ఏటా రూ&period;250 చొప్పున మాత్రమే పెంచిందని మంత్రి ఆరోపించారు&period; కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే హామీ మేరకు పెన్షన్ పెంచి&comma; ఏప్రిల్ నుంచి బకాయిలతో సహా లబ్ధిదారులకు అందించిందన్నారు&period; 26 నెలల్లోనే రూ&period;73 వేల కోట్లను నేరుగా లబ్ధిదారుల చేతిలో పెట్టామని చెప్పారు&period; 6 లక్షల పెన్షన్లు తొలగించామన్న మాజీ మంత్రి బూడి ముత్యాల నాయుడు ఆరోపణలను ఖండిస్తూ&period;&period; ప్రభుత్వం ఏర్పడే నాటికి 65 లక్షల పెన్షన్లు ఉండగా&comma; ప్రస్తుతం 62&period;10 లక్షల మందికి అందుతున్నాయని వివరించారు&period; సహజ మరణాల కారణంగానే సంఖ్య తగ్గిందని&comma; ప్రభుత్వం తొలగించినవి కేవలం 3 వేలేనన్నారు&period;<&sol;p>&NewLine;<p>పెన్షన్ల వ్యవస్థలో కూటమి ప్రభుత్వం అనేక మార్పులు తీసుకొచ్చిందని కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు&period; మూడు నెలల పెన్షన్‌ను ఒకేసారి తీసుకునే వెసులుబాటు కల్పించామని&comma; పెన్షనర్ మరణిస్తే వెంటనే జీవిత భాగస్వామికి స్పౌస్ పెన్షన్ అందేలా చర్యలు చేపట్టామన్నారు&period; దివ్యాంగుల పెన్షన్‌ను రూ&period;6 వేలకు&comma; డయాలసిస్ బాధితుల పెన్షన్‌ను రూ&period;10 వేలకు&comma; దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పెన్షన్‌ను రూ&period;15 వేలకు పెంచామని చెప్పారు&period; అర్హుల నుంచి కొత్త దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించగా రెండు రోజుల్లోనే 2&period;30 లక్షల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు&period; సంక్షేమంతో పాటు అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని&comma; వైసీపీ చేస్తున్న విషప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని మంత్రి కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.

“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.

హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.