తిరుమలలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.

Advertisements

<p>తిరుమల శ్రీవారి భక్తుడిగా పనిచేస్తూ అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు&period; తిరుమలలో రెండో రోజు పర్యటన సందర్భంగా మాట్లాడిన ఆయన&period;&period; 1999లో తాను ప్రారంభించిన మ్యూజియాన్ని ఇప్పుడు ఆధునికీకరించామని చెప్పారు&period; వేంకటేశ్వరస్వామి చరిత్ర అందరికీ అర్థమయ్యేలా మ్యూజియాన్ని తీర్చిదిద్దినట్లు తెలిపారు&period; ఇందుకు సహకరించిన ట్రస్టుకు అభినందనలు తెలిపిన చంద్రబాబు&period;&period; రాబోయే ఐదేళ్ల పాటు నిర్వహణ బాధ్యతలను ట్రస్టుకే అప్పగిస్తున్నట్లు వెల్లడించారు&period;<&sol;p>&NewLine;<p>ప్రతి భక్తుడికి భద్రత కల్పించేందుకు ఎల్‌ఐసీ ద్వారా రూ&period;2 లక్షల బీమా అందిస్తున్నామని చంద్రబాబు తెలిపారు&period; ఆధార్ ఆధారిత పేపర్‌లెస్ క్లెయిమ్ సదుపాయాన్ని తీసుకొచ్చామని చెప్పారు&period; తిరుమలలో పవిత్ర భావం కొనసాగాలని&period;&period; రాజకీయాలకు వేదికగా మారకూడదని స్పష్టం చేశారు&period; తిరుమలలో వేంకటేశ్వరస్వామి స్మరణ తప్ప మరొకటి వినిపించకూడదని&period;&period; భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు&period;<&sol;p>&NewLine;<p>తిరుమలలో కొత్తగా 32 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించినట్లు చంద్రబాబు చెప్పారు&period; రిలయన్స్ 25&comma; భారత్ బయోటెక్ సంస్థ 7 బస్సులను అందించిందని తెలిపారు&period; సేవాభావంతో ముందుకొచ్చే ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పిస్తామని చెప్పారు&period; ఇప్పటికే 12 లక్షల మంది శ్రీవారి సేవకులుగా నమోదు చేసుకున్నారని&period;&period; వారిలో వైద్య&comma; విద్యా రంగాలకు చెందిన సేవకులు కూడా ఉన్నారని చంద్రబాబు వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “రణబాలి” మూవీ.

సెమీకాన్‌ ఇండియా-2026 ప్రారంభించిన మోదీ.

జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి.