అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.

Advertisements

<p>ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ సీనియర్ నేత&comma; మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది&period; రేపు ఉదయం పదున్నర గంటలకు హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఫోన్ ద్వారా సమాచారం అందించారు&period; అయితే అంబటి రాంబాబు తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ స్పందించారు&period; 15 రోజుల క్రితం గుండెకు స్టంట్‌లు వేయించుకున్నానని&comma; డాక్టర్ల సలహా మేరకు ప్రస్తుతం కోలుకుంటున్నానని తెలిపారు&period; పూర్తిగా కోలుకున్న తర్వాత ముందుగా సమాచారం ఇచ్చి విచారణకు వస్తానని&comma; తప్పనిసరిగా సహకరిస్తానని మెసేజ్ పంపారు&period; ఆయన సమాధానంపై ఈడీ అధికారులు ఇంకా స్పందించాల్సి ఉంది&period; ఇదే కేసులో ఇప్పటికే మర్రి సుబ్బారెడ్డి&comma; పురుషోత్తమరావుల వాంగ్మూలాలను ఈడీ నమోదు చేసుకుంది&period; గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ మద్యం దుకాణాలకు లిక్కర్ రవాణా కోసం సిగ్మా&comma; ప్రసాద్ ట్రాన్స్‌పోర్ట్ సంస్థలకు కాంట్రాక్టులు కట్టబెట్టినట్లు గుర్తించారు&period; మొదటి కాంట్రాక్టు కాలంలో వీరిద్దరూ కలిసి సుమారు 59&period;14 లక్షల మద్యం పెట్టెలు రవాణా చేశారని అధికారులు ప్రశ్నించారు&period; సిగ్మా సంస్థ నుంచి 15కోట్ల 44 లక్షలు అందుకున్నట్లు విచారణలో వెల్లడైంది&period; సబ్‌కాంట్రాక్టులు&comma; నిధుల మళ్లింపు&comma; అంబటి రాంబాబుతో ఉన్న సంబంధాలపై కూడా వివరాలు అడిగారు&period; ట్రాన్స్‌పోర్ట్ ఛార్జీలను అధికంగా పెంచడం వల్ల ప్రభుత్వ ఖజానాకు 195 కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లినట్లు ఈడీ లెక్కలు చూపిస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

కాంగ్రెస్ నేతల క్షుద్రపూజల ఆరోపణలపై కోర్టును ఆశ్రయించిన హరీష్‎రావు.