బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

Advertisements

<p>అన్నమయ్య జిల్లా బి&period;కొత్తకోట పట్టణంలోని పిటియం రోడ్డులో ఉద్రిక్తత నెలకొంది&period; పెద్దతిప్పసముద్రం మండలంలో వంట గ్యాస్ సిలిండర్ల కోసం లబ్ధిదారులు రోడ్డెక్కారు&period; ఇండియన్ గ్యాస్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు&period; ఎన్నిసార్లు గ్యాస్ బుక్ చేసుకున్నా&period;&period; బుకింగ్‌ను రద్దు చేసి సిలిండర్లు ఇవ్వడం లేదని లబ్ధిదారులు ఆరోపించారు&period; మరోవైపు కొంతమంది దుకాణదారులకు గ్యాస్ సిలిండర్లను బ్లాక్‌లో విక్రయిస్తూ&period;&period; సాధారణ వినియోగదారులకు సిలిండర్లు అందడం లేదని ఆరోపిస్తూ స్థానికులు రోడ్డుపై బైఠాయించారు&period; దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది&period; గతంలోనూ గ్యాస్ సరఫరాపై ఫిర్యాదులు రావడంతో నెల రోజుల క్రితం అధికారులు ఇండియన్ గ్యాస్ ఏజెన్సీని సీజ్ చేశారు&period; అనంతరం తిరిగి ప్రారంభించినప్పటికీ పరిస్థితిలో మార్పు లేదని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు&period; గ్యాస్ కొరతకు శాశ్వత పరిష్కారం చూపాలని&comma; అర్హులైన వినియోగదారులకు సకాలంలో సిలిండర్లు అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.

కాంగ్రెస్ నేతల క్షుద్రపూజల ఆరోపణలపై కోర్టును ఆశ్రయించిన హరీష్‎రావు.