భానుడి భగభగల నుంచి ఏపీ ప్రజలకు ఉపశమనం..

భానుడి భగభగల నుంచి ఏపీ ప్రజలకు ఉపశమనం

Advertisements

<p>గత కొద్ది రోజులుగా భానుడి భగభగలతో అల్లాడిపోతున్న ఏపీ ప్రజలకు వరుణుడు కాస్త ఉపశమనం కలిగించాడు&period; రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అకస్మాత్తుగా వాతావరణం మారిపోయి&comma; ఈదురుగాలులు&comma; ఉరుములు&comma; మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి&period; వేసవి తాపంతో&comma; అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు ఈ వర్షం ఎంతో చల్లదనాన్ని ఇచ్చింది&period; అయితే&comma; బలమైన ఈదురు గాలుల కారణంగా పలు జిల్లాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది&period;<&sol;p>&NewLine;<p>పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు&comma; నరసాపురంలో ఉరుములు&comma; మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీచి భారీ వర్షం కురిసింది&period;కొన్ని రోజులుగా ఉన్న ఉక్కపోతకు ఉపశమనం లభించడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు&period; పలుచోట్ల రహదారులపై వర్షపు నీరు నిలిచిపోగా&comma; విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది&period; పల్నాడు జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది&period; భానుడి భగభగలతో అల్లాడిపోయిన ప్రజలకు భారీ ఈదురుగాలులు&comma; వడగండ్ల వర్షం షాక్ ఇచ్చాయి&period; నరసరావుపేటతో పాటు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు&period;భారీ ఈదురుగాలులతో పాటు వడగండ్ల వర్షం కురవడంతో రోడ్లపై ప్రయాణిస్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు&period; పలుచోట్ల ప్రజలు షాపులు&comma; భవనాల వద్ద ఆశ్రయం పొందారు&period;ఈదురు గాలుల ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది&period; దీంతో ప్రజలు చీకట్లో ఇబ్బందులు పడుతున్నారు&period; వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండగా&comma; వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది&period;<&sol;p>&NewLine;<p>ఎన్టీఆర్ జిల్లా నందిగామలో అర్ధరాత్రి భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది&period; బలమైన గాలుల ప్రభావంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు&comma; చెట్లు విరిగిపడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు&period;<br &sol;>&NewLine;బలమైన గాలుల కారణంగా పలు ప్రాంతాల్లో భారీ చెట్లు నేలకూలాయి&period; అలాగే విద్యుత్ స్తంభాలు విరిగిపడటంతో విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడింది&period;రోడ్లపై చెట్లు పడిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు&period; సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ&comma; మున్సిపల్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి రహదారులపై పడిన చెట్లను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు&period;భారీ గాలులు&comma; వర్షంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు&period; ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు&period;<&sol;p>&NewLine;<p>నెల్లూరు జిల్లాలో తెల్లవారుజాము నుంచి భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది&period; కోవూరు నియోజకవర్గంలోని కొడవలూరు&comma; విడవలూరు&comma; బుచ్చిరెడ్డిపాలెం&comma; కోవూరు&comma; ఇందుకూరుపేట మండలాల్లో వర్షం ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది&period; భారీ గాలుల కారణంగా పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో భారీగా గంజాయి పట్టివేత..

మేడ్చల్ జిల్లాలో ప్రేమపేరుతో వేధిస్తున్న యువకుడి అరెస్టు..

ధాన్యం కొనుగోలుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్..