టీడీపీ ఆవిర్భావమే ఒక తిరుగులేని చరిత్ర -హోంమంత్రి అనిత..

టీడీపీ ఆవిర్భావమే ఒక తిరుగులేని చరిత్ర -హోంమంత్రి అనిత

Advertisements

<p>రికార్డులు సృష్టించడం తెలుగుదేశం పార్టీకి కొత్త కాదని&comma; ఆ పార్టీ ఆవిర్భావమే ఒక తిరుగులేని చరిత్ర&comma; సంచలనమని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు&period; మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న మహానాడు వేడుకల్లో ఆమె పాల్గొన్నారు&period; ఈ సందర్భంగా మాట్లాడుతూ&period;&period; ప్రస్తుతం హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్న ఈ మహానాడు ద్వారా గ్రామ గ్రామానికి&comma; ప్రతి కార్యకర్త హృదయానికి పార్టీ చేరుతోందని హర్షం వ్యక్తం చేశారు&period; ఈ ఏడాది మహానాడును స్త్రీశక్తి థీమ్‌తో నిర్వహించడం మహిళల ఆత్మగౌరవం&comma; సాధికారత&comma; భద్రత పట్ల టీడీపీకి ఉన్న సంకల్పానికి నిదర్శనమని అనిత పేర్కొన్నారు&period; మహిళలకు రాజకీయాల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతోనే నారా లోకేశ్ 33 శాతం సీట్ల కేటాయింపుపై భారీ ప్రకటన చేశారని గుర్తుచేశారు&period; ఇదే వేదికపై వైసీపీపై హోంమంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు&period; గతంలో జై జగన్ అనడానికి నిరాకరించి&comma; &OpenCurlyQuote;జై చంద్రబాబు&period;&period; జై తెలుగుదేశం’ అన్నందుకు బీసీ కార్యకర్త తోట చంద్రయ్యను గొడ్డలి పార్టీ రౌడీలు నడిరోడ్డుపై గొంతుకోసి చంపారని మండిపడ్డారు&period; నాటి జగన్ ప్రభుత్వం ఆ కుటుంబానికి అన్యాయం చేస్తే&period;&period; నేడు చంద్రబాబు ప్రభుత్వం వారికి అండగా నిలిచిందని తెలిపారు&period; మహానాడు పండుగ వేళ చంద్రయ్య కుమారుడు వీరాంజనేయులు ప్రభుత్వ ఉద్యోగిగా నియమితులయ్యారని అనిత వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అన్నమయ్య జిల్లా అరవీడులో రెండు ఆర్టీసీ బస్సులు ఢీ..

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా గిరి ప్రదక్షిణ..

గ్రేటర్ హైదరాబాద్‌ రాజకీయాల్లో కీలక పరిణామాలు..