విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్.. జూన్ 1 నుంచి కార్యకలాపాలు..

విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్.. జూన్ 1 నుంచి కార్యకలాపాలు

Advertisements

<p>ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల కల నెరవేరనుంది&period; విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు కానున్న దేశంలోని 18à°µ రైల్వే జోన్ &&num;8216&semi;దక్షిణ కోస్తా రైల్వే&&num;8217&semi; జూన్ 1 నుంచి అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించనుంది&period; ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది&period;<br &sol;>&NewLine;దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ&comma; గుంటూరు&comma; గుంతకల్లు డివిజన్లతో పాటు&comma; తూర్పు కోస్తా రైల్వేలోని వాల్తేరు డివిజన్‌ను పునర్‌వ్యవస్థీకరించి &&num;8216&semi;విశాఖపట్నం డివిజన్‌&&num;8217&semi;గా మార్చి కొత్త జోన్‌లో విలీనం చేశారు&period; ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014లోని హామీ మేరకు ఈ ప్రాంతంలో రైల్వే పాలనను మెరుగుపరిచే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు&period; 2019 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన ఈ జోన్ ఏర్పాటు ప్రక్రియ ఇప్పుడు కార్యరూపం దాల్చింది&period;<br &sol;>&NewLine;ఈ పునర్వ్యవస్థీకరణతో సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే పరిధి గణనీయంగా తగ్గనుంది&period; ప్రస్తుతం ఆరు డివిజన్లు ఉండగా&comma; ఇకపై హైదరాబాద్&comma; నాందేడ్&comma; పునర్‌వ్యవస్థీకరించిన సికింద్రాబాద్ డివిజన్లతో మాత్రమే కొనసాగుతుంది&period; కార్యకలాపాల సౌలభ్యం కోసం పలాస-ఇచ్ఛాపురం&comma; రాయచూరు-వాడి వంటి కొన్ని సెక్షన్లను కూడా సర్దుబాటు చేశారు&period;<br &sol;>&NewLine;కొత్త జోన్ ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు వేగవంతం కావడంతో పాటు&comma; పాలనా సామర్థ్యం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు&period; జూన్ 1à°¨ కార్యకలాపాలు ప్రారంభించేందుకు రైల్వే ఉన్నతాధికారులు ఏర్పాట్లను సమీక్షించారు&period; విశాఖలో తాత్కాలిక భవనంలో జోన్ కార్యకలాపాలు ప్రారంభం కానుండగా&comma; శాశ్వత భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..