ఏలూరు జిల్లాలో గాలివాన బీభత్సం..

ఏలూరు జిల్లాలో గాలివాన బీభత్సం

Advertisements

<p>ఏలూరు జిల్లాలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది&period; వర్షం ధాటికి ఎక్కడికక్కడ వృక్షాలు&comma; చెట్ల కొమ్మలు విరిగి రహదారులపై పడ్డాయి&period; దీనితో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది&period; మరోవైపు&comma; చెట్లు విద్యుత్ స్తంభాలపై కూలడంతో తీగలు తెగిపడి&period;&period; జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది&period; ఈ అకాల వర్షాలు అన్నదాతలను నిలువునా ముంచేశాయి&period; జిల్లాలో ఒకపక్క తీవ్రమైన ఎండలు&comma; మరోపక్క అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షాల వల్ల&period;&period; వాతావరణంలో వచ్చిన మార్పులు ఆక్వా రంగంపై కోలుకోలేని దెబ్బ కొట్టాయి&period; చెరువుల్లో ఆక్సిజన్ అందక రొయ్యలు ఊపిరాడక మృత్యువాత పడుతున్నాయి&period; దీంతో లక్షలాది రూపాయల పెట్టుబడి పెట్టిన ఆక్వా రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు&period; అటు చేతికొచ్చిన మామిడి కాయలు ఈదురు గాలులకు రాలిపోగా&period;&period; వరి&comma; మొక్కజొన్న పంటలు నీటమునిగి పొలాల్లోనే నేలవాలాయి&period; &period;దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు ఏలూరు జిల్లా నుంచి అందిస్తారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..