రైతుల ఆశాదీపం ఇప్పుడు తుప్పు పట్టిన జ్ఞాపకమా?

రైతుల ఆశాదీపం ఇప్పుడు తుప్పు పట్టిన జ్ఞాపకమా?

Advertisements

<p>ఉత్తరాంధ్ర రైతాంగానికి ఒకప్పుడు ఆర్థిక బలంగా నిలిచిన శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస చక్కెర కర్మాగారం… ఇప్పుడు కేవలం తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుందా అనే ఆందోళన వ్యక్తమవుతోంది&period; 1958లో స్థాపించబడిన ఈ ఫ్యాక్టరీ&comma; దశాబ్దాల పాటు వేలాది మంది రైతులకు ఊతంగా &comma; వందలాది కుటుంబాలకు ఉపాధిగా నిలిచింది&period; చెరకు సాగుకు ప్రోత్సాహం ఇచ్చి&comma; స్థానిక ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించిన ఈ పరిశ్రమ నేడు తుప్పు పట్టిన యంత్రాలతో నిర్జీవంగా కనిపిస్తోంది&period; ఒకప్పుడు యంత్రాల హోరుతో మారుమోగిన ప్రాంగణం ఇప్పుడు నిర్మానుష్యంగా మారింది&period; ప్రభుత్వాల నిర్లక్ష్యం&comma; నీటి సమస్యలు&comma; సరైన ప్రణాళికల లోపం&comma; ప్రైవేటు పోటీ ప్రభావం కలిసి ఈ కర్మాగారాన్ని సంక్షోభంలోకి నెట్టాయని స్థానికులు ఆరోపిస్తున్నారు&period; ఇప్పుడు ఆమదాలవలస షుగర్ ఫ్యాక్టరీ మళ్లీ పూర్వవైభవం సంతరించుకోవాలని రైతులు&comma; కార్మికులు కోరుతున్నారు…<&sol;p>&NewLine;<p>1961లో క్రషింగ్ పనులు ప్రారంభించిన ఆమదాలవలస చక్కెర కర్మాగారం ఉత్తరాంధ్రలోనే ఒక ప్రధాన పరిశ్రమగా ఎదిగింది&period; రోజుకు 1200 మెట్రిక్ టన్నుల చెరకు క్రషింగ్ సామర్థ్యంతో పనిచేసిన ఈ ఫ్యాక్టరీ&comma; సీజన్ సమయంలో వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పించేది&period; సుమారు 1500 మంది సీజనల్&comma; పర్మినెంట్&comma; ఒప్పంద కార్మికులు ఈ కర్మాగారంపై ఆధారపడి జీవించేవారు&period; అంతేకాదు&comma; దాదాపు 12 వేల మంది షేర్ హోల్డర్లు ఈ ఫ్యాక్టరీతో అనుబంధం కలిగి ఉండేవారు&period; అయితే కాలక్రమేణా పరిస్థితులు మారిపోయాయి&period; చెరకు దిగుబడులు తగ్గడం&comma; నీటి కొరత తీవ్రతరం కావడం&comma; ప్రభుత్వాల నిర్లక్ష్యం వంటి కారణాలతో కర్మాగారం క్రమంగా నష్టాల్లోకి వెళ్లింది&period; దీనికి తోడు సమీపంలోని సంకలి చక్కెర కర్మాగారానికి అనుమతులు రావడంతో రైతులు అక్కడికి మళ్లిపోయారు&period; ఫలితంగా ముడిసరుకు కొరత ఏర్పడి ఆమదాలవలస ఫ్యాక్టరీ పూర్తిగా కుంగిపోయింది&period;ఆమదాలవలస చక్కెర కర్మాగారం మూతపడటం కేవలం ఒక పరిశ్రమ మూతపడటమే కాదు… ఉత్తరాంధ్రలో వేలాది కుటుంబాల జీవనాధారాన్ని కోల్పోవడమేనని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period; ఒకప్పుడు చెరకు డబ్బులతో పిల్లలను చదివించుకున్న రైతులు&comma; కార్మికులు నేడు ఉపాధి కోసం వలసలు వెళ్లాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు&period; 2004లో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రైతులు&comma; కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేసారు &period; తర్వాత పాలకులు పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు&period; ఇప్పుడు 74 ఎకరాల విలువైన భూమి భూకబ్జాదారుల కళ్లలో పడిందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి&period; పరిశ్రమ పునరుద్ధరణకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు&period; మళ్లీ యంత్రాలు తిరగాలి… రైతులు చెరకు సాగు చేయాలి… యువతకు ఉపాధి రావాలి… ఇదే ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష&period; ప్రభుత్వం స్పందిస్తేనే ఆమదాలవలస చక్కెర కర్మాగారానికి మళ్లీ తీపి రోజులు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..