82
సిఎం జగన్మోహన్ రెడ్డి పై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసారు తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి నాయుడు. సిఎం జగన్మోహన్ రెడ్డిపై అలిపిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రవి నాయుడు మాట్లాడుతూ సీఎం జగన్ ప్రతి ఏడాది జాబ్ కేలండర్ విడుదల చేస్తానని 2.35 లక్షల ఉద్యోగాల భర్తీ ఏమైంది జగన్ అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఒక డీఎస్సీ నోటిఫికేషన్ లేదు యువత ఉద్యోగాలు లేక డ్రగ్స్, గంజాయికి బానిసలుగా మారుతున్నరు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడంతో రాష్ట్రంలో 189 మంది యువకులు, నిరుద్యోగ యువత అవమానంతో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ హత్యలు ప్రభుత్వ హత్యలుగా భావించాలని రవి నాయుడు ఆరోపించారు.