చంద్రగిరి, తిరుపతి రూరల్ మండలం బడి సుధాయాదవ్ పోరాటం Badi Sudha Yadav Protest
పుదిపట్లలో రాష్ట్ర ఒబిసి ఫోరం కన్వీనర్ బడి సుధాయాదవ్(Badi Sudha Yadav) తుమ్మలగుంట చెరువును సంరక్షించాలని ఆమరణ నిరహార దీక్ష చేపట్టారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధీనంలో ఉన్న తుమ్మలగుంట చెరువును రక్షించాలని తన అనుచరులతో కలిసి పుదిపట్ల లోని చెర్లోపల్లి సర్కిల్ లో ఆమరణ నిరహార దీక్షకు దిగారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 100 కోట్లు తుడా నిధులు వెచ్చించి ఆధునీకరణ పేరుతో చెరువును సర్వ నాశనం చేశారని ఆరోపించారు. కాంట్రాక్టు పనులు కూడా తన కుమారుడుకి అప్పగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
చెరువును రక్షించండి.. నీటిని మళ్లించండి…
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా చెరువు అన్యాక్రాంతం పై చర్యలు తీసుకోవాలని కోరినా రెవెన్యూ, నీటి పారుదల శాఖ అధికారులు నిద్రపోతున్నారని మండిపడ్డారు. చెరువును రక్షించండి.. నీటిని మళ్లించండి అంటూ నినాదాలు చేశారు. చెరువును సర్వే చేసి బఫర్ జోన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దీక్షను అడ్డుకునేందుకు పోలీసులు యత్నించగా శాంతియుతంగా దీక్ష చేస్తున్నామని బడి సుధాయాదవ్ తెలిపారు. తుమ్మలగుంట చెరువు రక్షణ కోసం ప్రాణ త్యాగానికి సిద్దమంటున్నారు బడి సుధాయాదవ్.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి